The service should be: DIG Prabhakara

సేవాభావం వుండాలి : డీఐజీ ప్రభాకరరావు

Date:15/02/2018
చిత్తూరు ముచ్చట్లు:
ప్రజలు సేవా భావం కలిగిఉండాలని డిఐజీ ప్రభాకరరావు పిలుపునిచ్చారు.  పోలీసు ల  సేవ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ని  పోలీసులు దత్తతకు   తీసుకుని వివిధ రకాల అభివృద్ధి పనులు చేశారు, ఇందులో భాగంగా ఆసుపత్రి కి వచ్చే రోగులకు, బందువులు అహ్లాదకరమైన   వాతావరణం కల్పిచేలా  దాతల సహాయంతో నిర్మించిన విశ్రాంతి పార్క్ ను డీఐజీ ప్రభాకర్ రావు గురువారం  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా  చిత్తూరు పోలీసులు  ప్రభుత్వాసుపత్రి ని సుందరంగా తీర్చిదిద్దే రాష్ట్రంనే ఆదర్శంగా నిలిచారన్నారు. సుమారు 50 లక్షల రూపాయి లతో వివిధ రకాల అబివృద్ది పనులు చేసిన  పోలీసు అధికారుల ను అభినందించారు,  ఈ కార్యక్రమానికి దాతలసహకారం అభనందనీయమని,  వారి సేవా భావంతోనే ఇంతటి అభివృద్ధికి పనులు చేయడం జరిగిందన్నారు.   పోలీసుల స్పూర్తితో అందరూ సేవా కార్యక్రమాలు చేయాలన్నారు.  చిత్తూరు జిల్లలో  స్థాపించిన కమ్యూనిటీ  పోలీసు వ్యవస్థ  రాష్ట్రం లో అన్ని జిల్లాల్లో పురుడు పోసుకోనుందని  తెలిపారు.  చిత్తూరు జిల్లా లో జరిగిన ఈ కార్యక్రమం అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దాతలు మరింతగా ముందుకు వచ్చి పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలల్లో  భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం దాతలను ఎస్సైలులు ఉమ మహేశ్వర రావు, సోమ శేఖర్  రెడ్డి,  తదితరులను  డీఐజీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు, ఎఎస్పీ  రాధిక, వైద్య అధికారులు, పోలీసు దాతలు,  అధికారులు, విద్యార్తులు పాల్గొన్నారు.
Tags: The service should be: DIG Prabhakara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *