కాంగ్రెస్ తోనే  అంటున్న శివసేన

ముంబై ముచ్చట్లు:
 
ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపడమే టార్గెట్‌గా మరో ఫ్రంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్‌ ఏర్పాటుకోసం కొన్ని రాష్ట్రాల సీఎంలు ప్రయత్నాలు చేస్తున్నారు.. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే.. ఇలా అంతా ఏకతాటిపైకి వస్తున్నారు.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. కాంగ్రెస్ లేకుండా ఎలాంటి పొలిటికల్ ఫ్రంట్ సాధ్యం కాదని స్పష్టం చేశారు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫ్రంట్‌ను ప్రతిపాదించారని వెల్లడించిన ఆయన.. ఆ సమయంలో కాంగ్రెస్ ను కలుపుకునే ఫ్రంట్ ఉండాలని చెప్పామన్నారు.. అయితే, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు..ఇక, కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి చర్చలు కూడా జరలేదన్నారు సంజయ్‌ రౌత్.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. బీజేపీని ఎదుర్కోవడానికి ఒక ఫ్రంట్ గురించి మాట్లాడినప్పుడు కూడా, కాంగ్రెస్‌ను వెంట తీసుకెళ్లాలని తాము స్పష్టం చేశామన్నారు.. కాగా, తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ముంబైలో శివసేన అధినేత మరియు మహారాష్ట్ర కౌంటర్ ఉద్ధవ్ థాకరేను కలిశారు. ఈ సమావేశంలో సంజయ్‌ రౌత్, నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌తో సమావేశం అయ్యారు.. ఈ నేపథ్యంలో సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.. కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పడుతుందని మేం ఎప్పుడూ చెప్పలేదన్న ఆయన.. ఫ్రంట్‌ ఏర్పాటు జరిగితే.. కాంగ్రెస్‌ను కలుపుకుపోవాలని మాట్లాడిన మొదటి రాజకీయ పార్టీ శివసేనే అన్నారు.. అయితే, మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో సహా మూడు పార్టీల కూటమి ప్రభుత్వానికి శివసేన నేతృత్వం వహిస్తోన్న విషయం విదితమే.. మరోవైపు, బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజకీయ ఐక్యత ప్రక్రియను ఈ చర్చలు వేగవంతం చేస్తాయని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ఇప్పటికే పేర్కొంది.
 
Tags; The Shiv Sena is talking with the Congress

Natyam ad