రోడ్డు ప్రమాదానికి ఆరుగురు బలి

Date : 25/12/2017

తమిళనాడు ముచ్చట్లు: 

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా అచ్చరపాక్కం వద్ద  తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలోఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. రోడ్డు ప్రక్కన ఆగివున్న కారును తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పక్కనే ఉన్న చెరువులోకి పడిపోయింది.ఈ  ప్రమాదంలో కారు లోపల ఉన్నవారు నీటిలో నుంచి బయటకు రాలేకపోయారు. కారులో మొత్తం ఎనిమిది మంది ఉండగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పుదుకొట్టే  వాసులుగా అనుమానిస్తున్నారు. కారును చెరువులో నుంచి బయటకు తీసి పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Tags : The six victims of the road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *