నీళ్లు-నిధులు-నియామకాల నినాదం పరిపూర్ణమైంది –మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

-ఉద్యమ నాయకుడైన కేసీఆర్ సారధ్యంలోనే ఇది సాధ్యమైంది
హైదరాబాద్ ముచ్చట్లు:
“తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు నీళ్లు-నిధులు-నియామకాలు నినాదంతో ఆనాడు సబ్బండ వర్గాలను ఏకం చేసారు.నాటి ఉద్యమ నాయకుడే నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో ప్రపంచమే అబ్బురపడే సాగునీటి ప్రాజెక్టులు కట్టి,మన నీళ్లు మనకు తెచ్చి తెలంగాణ బీడు భూములను పచ్చని పైరులతో కళకళలాడేలా చేసారు.
మన నిధులు మనకే ఆర్థిక క్రమశిక్షణతో ఖర్చు చేసుకోవడం వల్ల నేడు తెలంగాణ జిఎస్డీపి వృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగింది.
నియామకాల విషయంలో కూడా ఉద్యమ ట్యాగ్ లైన్ స్పూర్తిని కొనసాగిస్తూ… ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 11వేల 103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించడం,80వేల 39 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి నేడు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న.దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాలలో 95% స్థానికులకే దక్కే విధంగా జోనల్ విధానానికి రూపకల్పన చేసి,ఖాళీల భర్తీకి ఆదేశాలివ్వడం పట్ల కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగ యువత,విద్యార్థుల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమ ఏపాటిదో అర్ధమవుతుంది.ఏకకాలంలో 91వేల142 ఉద్యోగాలను జిల్లాలు,జోనల్,మల్టీ జోనల్ వారిగా భర్తీ చేయనున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్తున్న.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో నీళ్లు-నిధులు-నియామకాలు ట్యాగ్ లైన్ నినాదం పరిపూర్ణం గా సార్థకమైంది.బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రజల కోరికలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
కోడిగుడ్డు మీద ఈకలు పీకే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు దీనిపై మాట్లాడాలి.ప్రతి తెలంగాణ బిడ్డ శ్రేయస్సు,అభివృద్ధి కోసం  నిర్విరామంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్ఘాటిస్తున్నాను.
 
Tags:The slogan of water-funding-recruitment is perfect – Minister Wemula Prashant Reddy

Natyam ad