పుంగనూరులో 30 ఏళ్ల కలకు మూడేళ్లలో పరిష్కారం – ఎంపీ మిధున్ కృషి ఫలితం
– 17న సీఎం చేతులు మీదుగా ప్రారంభం
పుంగనూరు ముచ్చట్లు:
సుమారు 30 సంవత్సరాలుగా పుంగనూరు- పలమనేరు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడంలో ఆప్పటి ప్రజాప్రతినిధులు , ప్రభుత్వం విఫలం కాగా ఎంపీ మిధున్‌రెడ్డి కృషి ఫలితంగా మూడు సంవత్సరాలలో బైపాస్ రోడ్డు సుందరంగా రాకపోకలకు సిద్దమైంది. ఈ బైపాస్ రోడ్డును ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ఈనెల 17న ప్రారంభించి, పుంగనూరు ప్రజలకు అంకితం చేయనున్నారు.
సమస్య తీరింది….
పుంగనూరుకు బైపాస్‌రోడ్డు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. నిత్యం పుంగనూరు ప్రజలు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని ఇబ్బందులకు గురైయ్యేవారు. దీనిపై మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోడ్డు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు. రోడ్డు ఎస్టిమేట్లు, ప్రతిపాదనలతో ప్రాజెక్టు నివేదికలను సిద్దం చేశారు. మంజూరు బాధ్యతలను ఎంపీ మిధున్‌రెడ్డికి అప్పగించారు. దీనిపై ఎంపీ మిధున్‌రెడ్డి బైపాస్ రోడ్డు ఏర్పాటుకు కంకణం కట్టుకున్నారు. ఎంపీ తనకున్న పలుకుబడితో కేంద్ర రవాణాశాఖ మంత్రి నీతిన్ గడ్గారీ, కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చించి 2017లో రోడ్డు పనులకు అవసరమైన నిధులు రూ.309 కోట్లు విడుదల చేయించారు. పుంగనూరు -పలమనేరు , కృష్ణగిరికి అనుసంధానం చేసేలా 55 కిలో మీటర్ల మేర పనులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. దీనిపై కాంట్రాక్టర్లకు పనులను అప్పగించారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దురుద్ధేశంతో అభివృద్ధిని అడ్డుకున్నారు. కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేసి, వాటాల కోసం హెచ్చరించారు. కాంట్రాక్టర్లు వాటాలు ఇవ్వలేక పనిని పూర్తి చేయకుండ అర్ధాంతరంగా గాలికి వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డిలు బైపాస్ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలకు చెక్ పెట్టారు. బైపాస్ రోడ్డు పనులకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటి, రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకులతో పలుమార్లు చర్చలు జరిపి, పనులు ప్రారంభించారు. రోడ్డు పనికి కొంత మేర భూ సేకరణ సమస్య కావడంతో ఎంపీ మిధున్‌రెడ్డి పలుమార్లు బైపాస్ రోడ్డు వద్దకు వచ్చి రైతులతో స్వయంగా చర్చించడం, పనులను పరిశీలించడం, ఎంపీ హామిలతో కాంట్రాక్టర్‌కు, రైతులకు భరోసా లభించింది. బైపాస్ రోడ్డు చకచక పూర్తి కాబడింది. బైపాస్ రోడ్డును అత్యంత సుందరంగా, బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. మలుపులు, కూడలి ప్రాంతాలలో రహదారి భద్రతలను తెలియజేసేలా స్పీడు బ్రేకర్లు, రేడియం స్టిక్కర్లు తయారు చేశారు. కేంద్ర మంత్రి నీతిన్ గడ్గారీ , ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి బైపాస్ రోడ్డు ప్రారంభిస్తుండటంతో ప్రజలు మంత్రి పెద్దిరెడ్డికి, ఎంపీ మిధున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
బైపాస్ ఇలా…
పుంగనూరు బైపాస్ ఎన్‌హెచ్ 219 రోడ్డును మండలంలోని పలమనేరు రోడ్డులో గల అరబిక్ కాలేజ్ నుంచి ప్రారంభించి, చదళ్ల వద్ద గల తిరుపతి రోడ్డు మీదుగా ఎంబిటి రోడ్డులోని భీమగానిపల్లె వద్ద కలిసేలా రోడ్డు వేశారు. తొమ్మిందన్నర కిలో మీటర్ల పొడువుతో పెంచుపల్లి, బండ్లపల్లె, బాలగురప్పల్లె, మేలుపట్ల, భగత్‌సింగ్‌కాలనీ, రాగానిపల్లె, రాంపల్లె, దండుపాళ్యెం మీదుగా రోడ్డు ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్డు ప్రారంభమౌతుండటంతో ఆప్రాంతంలోని భూముల ధర అధికంగా పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది.
అడ్డుకున్న ఆగలేదు…
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంపీ మిధున్‌రెడ్డి బైపాస్ రోడ్డుపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. గత ప్రభుత్వాలు పుంగనూరు అభివృద్ధిని అడ్డుకున్నాయి. కానీ ఎంపీ ప్రత్యేక చొరవతో బైపాస్ రోడ్డు ఏర్పాటు పుంగనూరుకు తలమానికంగా నిలిచింది. అన్ని రంగాల వారీకి బైపాస్ రోడ్డు ఎంతో లభ్ధిచేకూర్చుతోంది..
– ఎస్. ఫకృద్ధిన్‌షరీఫ్, మైనార్టీల నాయకుడు, పుంగనూరు.
అభివృద్ధి పరుగులు…
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బైపాస్ రోడ్డు ఏర్పాటు కావడం , అభివృద్ధికి చిహ్నంగా మారింది. ఎంపీ మిధున్‌రెడ్డి కృషి ఫలితంగా బైపాస్ రోడ్డు ఏర్పాటైంది. రోడ్డు ప్రాంతంలో గల వేలాది మంది రైతులకు అధిక నష్టపరిహారంతో పాటు భూములకు అధిక ధరలు లభించడంతో రైతులు కోటీశ్వర్లుగా మారారు. అభివృద్ధి కోసం శ్రమిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి కుటుంభానికి రుణపడి ఉంటాం.
– జె.నరసింహులు, కౌన్సిలర్, పుంగనూరు.
Tags; The solution to the 30-year-old dream in Punganur in three years – the result of the efforts of MP Midhun