స్త్రీవిద్యకు మూలం సావిత్రీ బాయి పూలే.

-టీ బీసీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్
-12 మంది విశిష్ట ఉపాధ్యాయినులకు  సన్మానాలు
జగిత్యాల ముచ్చట్లు:
స్త్రీ విద్యకు మూలం సావిత్రీ బాయి పూలే అని టీ బీసీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు.గురువారం టీ బీసీ జేఏసి జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే వర్ధ0తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రి భాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం  ఈ సందర్భంగా 12 మంది నాగమణి బాటనీ అధ్యాపకురాలు,భాగ్యలక్ష్మి, తులసి,మంజుల,దివ్య,విశిష్ట మహిళా ఉపాధ్యాయినులను, ముగ్గురు ప్రతిభావంతులైన విద్యార్థినులను హరి అశోక్ కుమార్,రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణా రెడ్డి చేతుల మీదుగా మెమోంటోలు అందించి సన్మానించారు. ఈ  సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ సావిత్రీ భాయి పూలే జయంతి ని జాతీయ మహిళా దినోత్సవం గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు .మహిళా విద్యా దాత, సంఘ సంస్కర్త, భారత దేశంలో నే ప్రథమ మహిళా ఉపాధ్యాయిని సావిత్రీ బాయి పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో  రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కందుకూరి కృష్ణా రెడ్డి,టీబీసీ జేఏసి రాష్ట్ర కార్యదర్శి, మార్కెట్ డైరెక్టర్ బండారి విజయ్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగం భాస్కర్, నేతాజీ కాలేజీ ప్రిన్సిపాల్ బి.గంగాధర్,జిల్లా జేఏసి అధ్యక్షుడు కొండా లక్ష్మణ్, కార్యదర్శి ములస్తం శివ ప్రసాద్,యువజన జేసి జిల్లా అధ్యక్షుడు కూసరి అనిల్ కుమార్,కార్యదర్శి పంబాల రాం కుమార్,విద్యార్థి ఉమ్మడి జేఏసీ జిల్లా అధ్యక్షుడు ధోనూరి భూమా చారి, కార్యదర్శి పుప్పాల విజయ,కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షురాలు మధురిమ, జగిత్యాల పట్టణ అధ్యక్షురాలు సింగం పద్మ లత,ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల జెఏసి ప్రతినిధులు పాల్గొన్నారు.
 
Tags:The source of feminism is Savitri Bai Poole

Natyam ad