పోలీసుల అత్యుత్సాహం.. స్పీకర్ ఆగ్రహం

అమరావతి ముచ్చట్లు:
కరకట్టపై మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరారు. దీంతో గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అసెంబ్లీకి వచ్చి స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ ఇలాంటి ఘటనలు పునరావృతం కానీయొద్దని హెచ్చరించారు.అసలేం జరిగిదంటే..విజయవాడ నుంచి అసెంబ్లీకి ముఖ్యమంత్రి నివాసం మీదుగా వెళ్లే కరకట్ట మార్గంలో ఈరోజు ఉదయం పోలీసులు ఎవరినీ అనుమతించలేదు.కొన్ని సంఘాలు అసెంబ్లీ ముట్టడికి యత్నించిన నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఆ రహదారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు మరో మంత్రి లోకేశ్ వ్యక్తిగత సిబ్బంది, ఎమ్మెల్యేలు, ఇతర అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. గుర్తింపుకార్డులు చూపించినా అనుమతించలేదు. ఎమ్మెల్యేలనే తిప్పి పంపించాం.. మీరెంత అంటూ అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో అసెంబ్లీ వెళ్లే తమ హక్కులకు భంగం కలిగిందంటూ పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు
Tag: The speaker is angry with the policeLeave a Reply

Your email address will not be published. Required fields are marked *