రసవత్తరంగా మారిన ఆత్మకూరు రాజకీయాలు

Date:21/06/2018
నెల్లూరు ముచ్చట్లు:
ఆత్మకూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి..  అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత పార్టీ వీడుతున్నప్పటికీ ఆ పార్టీ జోష్ లో ఉంటే.. ప్రతిపక్ష పార్టీలో మాత్రం అసంత్రప్తులు, టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.. ఆనం మార్పు టీడీపీలో ఐక్యత పెంచగా.. అటు మేకపాటి ఫ్యామిలీలో మాత్ర ఇంటర్నల్‌ వార్‌ మొదలైంది. ఆత్మకూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి..   మాజీమంత్రి, ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మార్పు తెలుగుదేశంలో ఐక్యత పెంచగా, ప్రతిపక్ష వైసీపీలో కల్లోలం పెంచుతోంది.. వైసీపికి జిల్లాలో పెద్ద దిక్కుగా చెప్పుకుంటూ చెలామణి అవుతున్న మేకపాటి ప్యామిలిలో ఇంటర్నల్ వార్ మొదలైంది.. పార్టీ మారినా… ఆత్మకూరు నుంచే పోటీ చేస్తానని ఆనం ప్రకటించడంతో.. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే,  ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.. అధినేత జగన్మోహన్ రెడ్డిని సంప్రదించకుండానే ఆత్మకూరు నుంచి పోటీ చేస్తానని ఆనం ప్రకటించడం ఏంటంటూ ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి ముందు పైరయ్యినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఆనం అంటే పడని వైసీపీ ముఖ్యనేతలు, నాయకులు తెలుగుదేశంలోకి వచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. మరో వైపు ఆనం టీడీపీని వీడుతుండటంతో మంత్రులు  సోమిరెడ్డి, నారాయణ, జిల్లాఅధ్యక్షులు బీదా రవిచంద్ర ఐక్యంగా పనిచేస్తున్నారు..  ఆనం పార్టీని వీడితే జరిగే నష్టాన్ని నివారించేందుకు పైఎత్తులు వేస్తున్నారు.. ఆనం వీడినా నష్టం లేదనే సంకేతాలిస్తున్నారు.. మరోపక్క అదికారపార్టీలో ఆత్మకూరుకు కాబోయే ఎమ్మెల్యే కోసం పోటీ తీవ్రంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, గూటూరు కన్నబాబు, దనుంజయ్ రెడ్డిలు తమకే ఇన్ చార్జి ఇవ్వాలంటూ  అధినేతకు వినతుల మీద వినతులు ఇస్తున్నారు.  కొమ్మి లక్ష్మయ్య నాయుడికి ఆత్మకూరు నియోజకవర్గంమీద మంచి పట్టుంది.. ఓసారి టీడీపీ తరపున గెలిచిన ఆయన మరోసారి స్వతంత్రంగా పోటీ చేసి  విజయం సాధించారు.. డీసీసీబీ చైర్మన్ దనుంజయ రెడ్డికి రెడ్డి సమాజికవర్గంతో పాటు, ఆర్దికబలం కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.. మరో నేత కన్నబాబుకు వర్గంతో పాటు సానుభూతి ఉంది. ఆనం పార్టీ మారుతూ  టీడీపీకి మంచి  చేస్తుడగా, వైసీపీలో మాత్రం కల్లోలం రేపినట్లు పొలిటికల్ చర్చ నడుస్తోంది.. ముఖ్యంగా మేకపాటి కుటుంబంలొ అసంత్రుప్తిని రాజేసినట్లు సమాచారం.. మేకపాటి కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరినట్టు వైసీపీ వర్గాలు చబుతున్నాయి.. జగన్ కోసం అన్ని విధాలుగా నష్టపోయిన మేకపాటి కుటుంబాన్ని పక్కనపెట్టి,  ఎవ్వరో వస్తారని, ఏదో చేస్తారని ఆనంను పార్టీలోకి తీసుకోవడ పట్ల మేకపాటి అనుచరులు  తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు..ఏదైమైనా ఆనం  వైసీపీలో చేరితే.. తెలుగుదేశం పార్టీ  కంటే వైసీపీకే ఎక్కువ నష్టం జరిగే అవకాశాలున్నాయనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం..
రసవత్తరంగా మారిన ఆత్మకూరు రాజకీయాలుhttp://www.telugumuchatlu.com/the-spirit-of-the-spirit-turned-into-politics/
Tags:The spirit of the spirit turned into politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *