విప్లవ శిబిరంలో చీలికలు శత్రువులకు ఊతం.

సిపీఐ (ఎంఎల్ ) క్రాంతి జాతీయ కార్యదర్శి మల్లెపల్లి ప్రభాకర్.
హైదరాబాద్   ముచ్చట్లు:
ప్రజా విప్లవకారుల త్యాగాల ఫలితంగా ప్రజా ప్రతిఘటన పోరాటాలు అమరవీరుల త్యాగాల ఫలితంగా ప్రజా ప్రతిఘటన పోరాటాలు లక్షలాది ఎకరాల భూములు స్వాధీనం, ఆత్మగౌరవ పోరాటం అభివృద్ధి ఆందోళనతో వెల్లివిరిసిన చరిత్ర ఉన్న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి నాయకత్వం నుండి నేటి వరకు గ్రూపులు చీలుతు  ప్రజా యుద్ధ విప్లవ శిఖరానికి శత్రువులను ఆహ్వానించినట్లే నని  సిపిఐ ఎంఎల్ క్రాంతి జాతీయ కార్యదర్శి మల్లే పల్లె ప్రభాకర్ నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతోమంది విప్లవ అమరుల త్యాగాలను అవహేళన చేసినట్లు గానే నేటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విప్లవ  ప్రజలు కూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. ఖమ్మం మెట్టు ఇల్లందు ప్రాంతంలో విప్లవ పార్టీలు కాకుండా పరాయి పార్టీల జెండాలు కనిపించేవి కావు. నేడు ఈ ప్రాంతంలో పూర్తిగా అధికార పార్టీ రాజకీయాలు ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ మొదలుకొని గ్రానైట్ మాఫియా, ల్యాండ్ మాఫియా గ్యాంగ్ ప్రజలపై రాజ్యమేలుతున్నాయి. ఒకవైపు దేశంలో రాష్ట్రంలో రాజకీయ క్లిష్ట పరిస్థితులు మరోవైపు హిందూ మతోన్మాదం మరోవైపు కార్పొరేట్ శక్తుల ఒత్తిడి మేరకు దళారుల దోపిడీ పెట్టుబడి దార్ల ఆంక్షల మేరకు కార్మిక కర్షకుల విద్యార్థులు మహిళలపై వారి హక్కుల పై దాడులు మరోవైపు నాయకులు కార్యకర్త లే టార్గెట్ గా బిజెపి ప్రభుత్వం దండకారణ్యం మొదలుకొని పట్టణ ప్రాంతంలో అర్బన్ నక్సలైట్ల పేరుతోరాజ్య హింస  కొనసాగిస్తూ భయంకరమైన నల్ల చట్టాలను మోపుతూ సుదీర్గంగా  జైల్లో వేస్తూ దండకారణ్యంలో అమాయక ఆదివాసీలను చంపుతున్నారని పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన పోలీసులు దండకారణ్యం బేస్ క్యాంప్ పోలీస్ హెడ్ కోటర్స్ నిర్మించుకుని ఆదివాసి ప్రజలపై మిలటరీ పాలన కొనసాగిస్తూ ఆదివాసీలను కాందిశీకులు మార్చివేసి నారన్నారు. అడవుల్లో ఉన్న నిధి నిక్షేపాలు బాక్సైట్ సహజ వనరులను దోచుకునేందుకు పోస్ట్ వేదాంత జిందాల్ స్వదేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలు పోటీపడుతున్నాయని, ఈ కష్ట సమయంలో ప్రజా పంటగా  చీలిపోవడం మనపై మన శత్రువు పై చేయి సాధించినట్లు అయింది. ఇప్పటికైనా విప్లవ ప్రజా ఉద్యమాలు ద్రుష్ట  విప్ల సంస్థలు ఐక్య ఉద్యమాలకు కలిసి వచ్చి  విప్లవకారుల ఐక్యత చాటాలనిప్రబాకర్ పిలుపు నిచ్చారు. అమరుల  ఆశయసిద్ధి కోసం పోరాటాలను ఐక్య ఉద్యమాలను నిర్మించాలని ఆ దిశగా సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా ను  కోరుకుంటున్నట్లు ప్రభాకర్ పేర్కొన్నారు.
 
Tags:The splits in the revolutionary camp were a blow to the enemy.

Natyam ad