రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదు ఫ ఎంపీ గీత

Date:13/02/2018
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
కేంద్రప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారో తెలుగుదేశం పార్టీకి స్పష్టత లేదని పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.  రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై వారంలోగా వివరాలు ఇవ్వాలని ప్రధానమంత్రి సహా కేంద్రమంత్రులకు లేఖలు రాశానని తెలిపారు. కేంద్రం నుంచి సమాధానం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని ఎంపీ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరం రాష్ట్రం కోసం పోరాడాలి. రాష్ట్రానికి ఎంత నిధులు వచ్చాయో కేంద్రం నుంచి స్పష్టత రావాలి. 34 మంది కేంద్రమంత్రులు సహా ప్రధానికి లేఖలు రాశానని ఆమె అన్నారు. రాష్ట్రానికి ఎంత నిధులు కేంద్రం నుంచి వచ్చాయో వారంలోగా తెలపాలని ప్రధానిని కేంద్రమంత్రులను కోరాను. బిజెపి టిడిపిమధ్య యుద్దంలా కనిపిస్తుంది.. కేంద్ర రాష్ట్రాల మద్య పోరులా లేదని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా రాష్ట్రం కోసం పోరాడాలి. ప్రజలు నష్టపరచకుండా నాయకులు వ్యవహరించాలి. రైల్వేజోన్ విశాఖకు రావాలి..అది మన హక్కని ఆమె అన్నారు. విజయవాడకు ఎయిమ్స్ రావడం వల్ల ఉత్తరాంధ్రకు నష్టం జరుగుతుంది.అన్ని సంస్థలు విజయవాడ,అమరావతికే వెళ్తున్నాయని ఆమె అన్నారు. విశాఖకు నష్టం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తానని ఆమె స్పష్టం చేసారు. విద్యాసంస్థల ప్రహరీ గోడ నిర్మాణాలకు వంద కోట్లయ్యాయి అంటున్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం  ఎంత ఇస్తామందో స్పష్టత రావాలి. ఆధారాలు లేకుండా ఆందోళనలు చేయలేమని ఆమె అన్నారు. కేంద్రం నుంచి సమాధానం వచ్చాక ఆ నిధులను ఏవిధంగా ఖర్చు చేసిందో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని అన్నారు.
Tags: The state government has no clarity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *