కాంగ్రెస్ తో పొత్తు వెనుక… స్టోరీ

Date:18/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ‌లో ముందస్తు ఎన్నిక‌ల ముచ్చట‌కు తెర‌లేచిన నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీలు పొత్తుల ఎత్తుల‌కు తెర‌దీశాయి. అధికారంలో ఉన్న టీఆర్ ఎస్‌ను, పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబ పాల‌న‌ను గ‌ద్దెదించుడే ధ్యేయంగా పార్టీలు ప‌క్కా వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలు వీలైనంత వ‌ర‌కు పొత్తుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే, ఈ పొత్తులకు నైతిక‌త ఉంటుందా? ఉండ‌దా? అనేది ప‌క్కన పెడితే.. త‌మ‌కు బ‌లం ఉన్న చోట గెలిచేందుకు, బ‌లంలేనిచోట ప‌క్కపార్టీల బ‌లంతో నెట్టుకు వ‌చ్చేందుకు ఇలా మొత్తానికి తెలంగాణాలో ఓ రాజ‌కీయ మార్పును తెచ్చేందుకు కంకణం క‌ట్టుకున్నట్టుగా స్వలాభాల పునాదుల‌పై పొత్తుల‌కు తెర‌లెత్తాయి.
ఇక‌, త‌న‌ను తాను జాతీయ పార్టీకి అధ్యక్షుడిన‌ని ప్రక‌టించుకునే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ పొత్తుల‌కు ప్రాధాన్యం పెంచారు.అనూహ్యంగా ఆయ‌న కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధప‌డ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల‌పై ఆత్మగౌర‌వ నినాదంతో ఏర్పాటైన టీడీపీ.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధప‌డ‌డం రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు.. అనే విష‌యాన్ని స్పష్టం చేస్తున్న ప‌రిణామం. అయితే, ఈ విష‌యంలో అత్యంత జాగ్రత్తగా త‌న అప‌ర చాణిక్య రీతికి ప‌దును పెంచారు బాబు. ఏపీలో ఈ ప్రభావం ప‌డ‌కుండా తెర‌మీద మాత్రం తెలంగాణ‌లో పొత్తుల విష‌యాన్ని అక్కడి త‌మ్ముళ్లకే విడిచి పెడుతున్నామ‌ని చెప్పుకొచ్చారు.
అయితే, ఏ నిర్ణయ‌మైనా బాబుకు తెలియ‌కుండా చేసే ధైర్యం తెలంగాణా నేత‌ల‌కు లేద‌నేది వాస్తవం. ఇక‌, పొత్తుల క్రమంలో ఇప్పటికే రెండు ద‌ఫాలు చ‌ర్చలు కూడా ముగిసిన ప‌రిస్థితిని మ‌నం చూశాం. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, న‌ల్లగొండ‌, రంగారెడ్డి, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల‌లో క‌నీసం 40 స్థానాల‌ను టీడీపీ నేత‌లు కాంగ్రెస్ నుంచి కోరుతున్నారు. అలాగే ఖ‌మ్మం, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ సీట్లు కూడా టీడీపీ కోరుతున్న వాటిల్లో ఉన్నాయి.అయితే, ఇక్కడ కాంగ్రెస్ నాయ‌కులు ఎలా టీడీపీతో పొత్తుకు సిద్ధమ‌వుతున్నార‌నేది కూడా ప్రధాన ప్రశ్న.
తెలంగాణ‌లో తుడిచిపెట్టుకుపోయిన పార్టీని త‌మ‌తో జ‌ట్టు క‌ట్టించుకుని వెళ్లడం వెనుక వ్యూహం ఏపీపైనే ఉంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. తెలంగాణ‌లో టీడీపీ ఉనికిని కాపాడ‌డంలో కాంగ్రెస్ దోహ‌ద కారిగా ఉంటే.. ఏపీలో కాంగ్రెస్ ఉనికిని కాపాడేందుకు చంద్రబాబు త‌న‌వంతు ప్రయ‌త్నాలు చేస్తారు. ఈ ముచ్చట నేప‌థ్యంలోనే ఇరు పార్టీల నాయ‌కులు ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు.
ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో 25 ఎంపీ స్థానాల్లోనూ త‌మ‌ను గెలిపించాల‌ని ఇప్పటి నుంచే పాట పాడుతున్న చంద్రబాబుకు వ‌చ్చే ఎంపీల స్థానాలు.. కేంద్రంలో త‌మ‌కు ల‌బ్ధి చేకూరుస్తాయ‌నేది కూడా కాంగ్రెస్ ఆలోచ‌న‌గా ఉంది.అదేస‌మ‌యంలో తెలంగాణాలోని త‌మ ఆస్తుల‌ను కాపాడుకునేందుకు, పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు క‌నీసం 20 స్థానాల్లో అయినా టీడీపీని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం చంద్రబాబుపై ఉంది.
ఈ క్రమంలోనే ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు విత్తులు నాటుకున్నాయి. ఈ ప‌రణామంలో నైతిక ఉందా లేదా అనేది ప‌క్కన పెట్టి.. ఇరు పార్టీల‌కు ల‌బ్ధి చేకూర్చుకోవ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా నాయ‌కులు క‌మిట్‌మెంట్ కు వ‌చ్చారు. ఇదీ.. తెలంగాణ‌లో కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు క‌థ‌!!
Tags:The story behind the alliance with the Congress … Story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *