The submarine fragments were available

ఆ జలాంతర్గామి శకలాలు లభ్యమయ్యాయి

Date : 21/12/2017
హైదరాబాద్ ముచ్చట్లు:
103 ఏళ్ల తర్వాత.. క్యాన్బెర్రా: ఎట్టకేలకు ఆస్ట్రేలియాకు చెందినఅతిపురాతన జలాంతర్గామి మిస్టరీ వీడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మునిగిపోయిన ఆస్ట్రేలియా దేశపు తొలి జలాంతర్గామి ఏఈ1 శకలాలను 103 ఏళ్ల తర్వాత గుర్తించారు. 1914, సెప్టెంబర్ 14న న్యూగునియా ద్వీప సమీపంలో ప్రయాణిస్తుండగా ఈ జలాంతర్గామి మునిగిపోయింది. ఆ సమయంలో ఇందులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్కి చెందిన 35 మంది సిబ్బంది ఉన్నారు. ఈ జలాంతర్గామి కోసం కొన్నేళ్ల పాటు గాలింపులు చేపట్టినా ఫలితం దక్కలేదు. రాయల్ ఆస్ట్రేలియా నేవీ పోగొట్టుకున్న తొలి జలాంతర్గామి ఇది.అయితే ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి మరిసే పెయిన్ ఈ జలాంతర్గామి శకలాలను గుర్తించినట్లు గురువారం వెల్లడించారు.న్యూగునియా ద్వీప సమీపంలో 300 మీటర్ల లోతులో ఈ జలాంతర్గామి శకలాలను గుర్తించినట్లు తెలిపారు. గతవారం నెదర్లాండ్స్కి చెందిన సర్వే నౌకతో గాలింపులు చేపట్టడంతో శకలాలను గుర్తించగలిగినట్లు పేర్కొన్నారు. అయితే జలాంతర్గామి మునిగిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు మరణించిన 35 మంది కుటుంబీకులను ఆస్ట్రేలియా ప్రభుత్వం సంప్రదించే యత్నంతో ఉందని తెలిపారు.జలాంతర్గామి శకలాలు లభ్యమయ్యాక ప్రమాదంలో చనిపోయిన వారి కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వారికి నివాళులు అర్పించారు. జలాంతర్గామి మృతుల జ్ఞాపకార్థంగా న్యూగినియాలో స్మారక స్థూపం నిర్మించాల్సిందిగా గినియా ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని పెయిన్ వెల్లడించారు. 1914 సెప్టెంబర్ 14న సముద్రంలో ప్రయాణిస్తున్న ఈ జలాంతర్గామికి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆస్ట్రేలియన్ ఓడతో సంబంధాలుతెగిపోయాయి. అయితే గినియా ద్వీపం సమీపంలో నివసిస్తున్న కొందరు గ్రామస్థులు తమకు సముద్రం నుంచి దెయ్యం రూపంలో ఉన్న మనుషులు, చేపలు కన్పించి ఒక్కసారిగా మాయం అయిపోతుండేవని చెప్తుండేవారు.
Tags: The submarine fragments were available

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *