ఏడుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

విజయవాడ ముచ్చట్లు:
 
ఆంధ్రప్రదేశ్లో సోమవారం ఉదయం ఏడుగురు నూతన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టుకు ఏడుగురిని న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా న్యాయమూర్తులుగా నియమితులైన తర్లాడ రాజశేఖరరావు, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, కొనకంటి శ్రీనివాసరెడ్డి, వడ్డిబోయిన సుజాత, ప్రమాణ స్వీకారం చేశారు.

Tags; The swearing in of seven new judges

Natyam ad