పోలీసులతో టీడీపీ ఎమ్మెల్యే వాగ్వాదం

Date:13/01/2018

విజయవాడ ముచ్చట్లు:

పోలీసులతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వాగ్వాదానికి దిగారు. కంకిపాడు మండలం ఈడ్పుగల్లులో కోడిపందేలు నిర్వహించకుండా పోలీస్‌ పికెట్లు ఏర్పాట్లు చేశారు. అయితే… అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే ప్రసాద్… సంప్రదాయ క్రీడలను ఎలా అడ్డుకుంటారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన బరికి సమీపంలో అనుచరులతో మంతనాలు నిర్వహిస్తున్నారు.కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: జాయింట్‌ సీపీ రమణకుమార్‌
కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని జాయింట్‌ సీపీ రమణకుమార్‌ హెచ్చరించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కొందరు ముగ్గుల పోటీల పేరుతో పేరుతో కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామని జాయింట్ సీపీ హెచ్చరించారు.

Tags : The TDP MLA is the ally of the police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *