షోఫియాన్ లో ఉగ్రవాదుల ఘాతుకం

Date:21/09/2018

శ్రీనగర్ ముచ్చట్లు:

జమ్మూ కాశ్మీర్ లోని షోఫియాన్ లో మరోమారు ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పోలీసులపై దాడులకు తెగబడి ఘాతుకానికి పాల్పడ్డారు.  షోఫియాన్ జిల్లాల్లో శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ఉగ్రవాదులు ముగ్గురు పొలిసు అధికారులు, ఓ కానిస్టేబుల్ నలుగుర్నికిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు అతి దారుణంగా హత్య చేసారు. మరో పొలిసు అధికారి తప్పించుకున్నారు.  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం షోఫియాన్ లో స్పెషల్ పొలిసు అధికారులుగా విధులు నిర్వహిస్తున్న ఫిర్దోస్ అహమ్మద్ కుచే, కుల్దీప్ సింగ్, నిసార్ అహమ్మద్ ధోబీలతో పటు నిసార్ సోదరుడు ఫయాజ్ అహమ్మద్ భట్ ను హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాదులు ఈ ఉదయం కిడ్నాప్ చేసారు. పోలీసుల ఇళ్లల్లోకి చొరబడి వారిని అపహరించుకు పోయారు. అయితే గ్రామస్థుల సహాయంతో నిసార్ సోదరుడు ఫయాజ్ తప్పించుకోగా మిగతా ముగ్గురుని ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. అనంతరం వారిని చంపేసినట్టు అధికారులు తెలిపారు.కొద్దిరోజుల క్రితమే ఈ ముగ్గురిని ఉగ్రవాదులు బెదిరించినట్టు తెలుస్తోంది. ‘నాలుగు రోజుల్లో మీరు ఉద్యోగాలకు రాజీనామా చేయండి లేదంటే మీ ప్రాణాలు పోతాయి’ అని అధికారులు తెలిపారు. గత నెలలో పోలీసులు కుటుంబాలకు చెందిన 8 మందిని ఉగ్రవాదులు అపహరించుకు పోయిన విషయం తెలిసిందే.వాంటెడ్ ఉగ్రవాది సలాహుద్దీన్ కుమారుడిని ఎన్ ఐ ఏ అధికారులు అరెస్టు చేయడంతో ఉగ్రవాదులు ఈ కిడ్నాప్ లకు పాల్పడ్డారు. అయితే తర్వాత విడిచిపెట్టినట్టు సమాచారం.

తిరుమల శ్రీవారికి పుష్కరిణి లో చక్రస్నానం

Tags:The terror of the terrorists in Shoufian

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *