The Timeslot method is implemented for devotees in Thirumala

తిరుమలలో సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్ విధానం అమలు!

Date: 09/12/2017
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 18 నుంచి సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్ విధానం అమలు చేయనున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేస్తామని తెలిపారు. ఆధార్ అనుసంధానంతో టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని, టోకెన్లు పొందిన భక్తులకు 2-3 గంటల వ్యవధిలో స్వామివారి దర్శనం పూర్తవుతుందని తెలిపారు. డిసెంబరు 23 నుంచి జనవరి మొదటి వారం వరకు ప్రొటోకాల్ ఉన్న వారికే వీఐపీ దర్శనం టిక్కెట్లు జారీ చేస్తామని, సిఫారసు లేఖలపై వీఐపీ దర్శన టిక్కెట్ల జారీ నిలిపివేస్తామని ,టైంస్లాట్ టోకెన్ల జారీకి 14 కేంద్రాల్లో 117 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Tag: The Timeslot method is implemented for devotees in Thirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *