టౌన్ ప్లానింగ్ అధికారి బాల సుబ్రమణ్యం ను సస్పెండ్ చేయాలి

తిరుపతి ముచ్చట్లు:
 
ఏపీ ఫైబర్ ఎల్ సి ఓ గా పర్మిషన్ ఇస్తానని ఆశావహుల నుండి ఆక్రమంగా లక్షలాది రూపాయలు వసూలుచేసి మోసం చేసిన ఏపీ పైబర్ తిరుపతి ఎం ఎస్ ఓ ప్రవల్లిక మరియు ఆమె తండ్రి ఎన్. బాల సుబ్రమణ్యం లపై తిరుపతి ఎల్ సి ఓ ల తరపున బైరాగిపట్టెడ ఎల్ సి ఓ ఎన్. రాజారెడ్డిల అడ్వర్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా ఇద్దరి పై ఐపీసి 420 రెడ్ విత్ 34 నమోదై అరెస్ట్ కాబడి బెయిల్ పై విడుదల కాగా, ఈ నెల 17న చార్జిసీట్ 296/22 పోలీసులు వేశారని, ప్రస్తుతం రాజంపేట మునిసిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్న బాల సుబ్రమణ్యం ను వెంటనే సస్పెండ్ చేయాలని శుక్రవారం ఉదయం బైరాగిపట్టెద లో ఏపీ ఫైబర్ ఎల్ సి ఓ రాజారెడ్డి కార్యాలయంలో చార్జి సీట్ పత్రమును విడుదల చేశారు. ఈ సందర్బంగా ఏపీ ఫైబర్ ఎల్ సి ఓ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్. రాజారెడ్డి మాట్లాడుతూ ఏపీ ఫైబర్ పేరుతో కోట్లాది రూపాయలు ఆక్రమంగా వసూలు చేసిన బాల సుబ్రమణ్యం అతని కూతురు ప్రవల్లికలపై కేసు పెట్టామని బెయిల్ పై వారు బయటకు వచ్చారని గురువారం వారిపై చార్జిసీట్ వేశారని ప్రస్తుతం రాజంపేట మునిసిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిగా అతనిని సస్పెండ్ చేయాలని కోరారు. ఈ చార్జీసీట్ పత్రాలను మునిసిపల్ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ కమిషనర్, రాజంపేట మునిసిపల్ కమిషనర్ కు పోస్ట్ ద్వారా పంపించామని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఎల్ సి ఓ యూనియన్ సహాయ కార్యదర్శి కిరణ్, షేక్ మహ్మద్ రఫీ, మునిక్రిష్ణా తదితరులు ఉన్నారు.
 
Tags: The Town Planning Officer should suspend Bala Subramaniam

Natyam ad