Natyam ad

బీసీలను మరోమారు దగా చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం.

-బడ్జెట్  ను నిరసిస్తూ ఈ నెల 10 న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, నిరసనలు.
-బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు.
హైదరాబాద్  ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం వన్ కి పెట్టిన బడ్జెట్ లో బీసీలను మరోమారు మరో మారు టిఆర్ఎస్ ప్రభుత్వం దగా చేసిందని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. 60 శాతం జనాభా ఉన్న బీసీలకు 2 శాతం నిధులు కేటాయించి రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మంది బీసీలను మోసం చేసిందని  దుయ్యబట్టారు. బడ్జెట్లో బీసీల సంక్షేమానికి ఒక్క కొత్త  పథకం ప్రవేశ పెట్టకపోగా  కొనసాగుతున్న వాటికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా రోజుకోదాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం  కుట్ర పన్నుతోందని శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం హైదరాబాదులో బిసి భవన్ లో  మీడియా సమావేశంలో 12 మంది వివిధ సంఘాల నేతలు కలిసి మాట్లాడారు. తరతరాలుగా తమ ఉత్పత్తులతో సంపద సృష్టిస్తున్న బీసీలకు సంపదలో వాటా ఇవ్వడం లేదని కానీ పనుల్లో అప్పుల్లో సగ భాగం కల్పించడం బిసిలను అనగద్రోక్కదం లో కుట్రలోని బాగామన్నారు. ఇదేక్కటి న్యాయం ఎన్నిరోజులు బీసీలను మోసం చేస్తారని ప్రశ్నించారు. అడుక్కోడానికి బీసీలేమైన బిచ్చగాళ్ళ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 5 లక్షల మంది బీసీలు స్వయం ఉపాధి కోసం, దుకాణాల కోసం దరఖాస్తు చేసుకుంటే దీనికి అతి గతి లేదు బడ్జెట్లో లేకపోవడం బీసీలను మరోసారి ప్రభుత్వం మోసం చేయడమే అన్నారు. బీసీ కులాల ఫెడరేషన్ కోటి కోటి కేటాయించిన ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ కు మాత్రం 100 కోట్లు కేటాయించినదాని, ఇది ముమ్మాటికి బీసీ వ్యతిరేక బడ్జెట్ అని స్పస్తామవుతున్దన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు కేసీఆర్ పైన వత్తిడి  తీసుకురావాలని  డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం మొత్తం 2.6 లక్షల కోట్ల లో బీసీలకు కేవలం 5.6 9 కోట్లను  కేటాయించదాన్ని  నిరసిస్తూ ఈ నెల 10 తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. అలాగే మండల డివిజన్ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన బీసీలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేష్ చారి బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకల శ్యామ్ కుర్మా, విద్యార్థి సంఘం అధ్యక్షులు తాటికొండ , విశ్వ గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, ఆయా సంఘాల నాయకులు కొలనూరు శ్రీనివాస్, రాజేందర్, పానుగంటి విజయ్, వరికుప్పల మధు యాదవ్, సాయి తేజ, నాగరాజు గౌడ్, ఇంద్ర, రాజేంద్ర ప్రేఅసాద్  తదితరులు పాల్గొన్నారు.
 
Tags:The TRS government has once again deceived the BCs.