అన్నిరంగాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం        .

-స్త్రీలను గౌరవించే సంస్కృతి మనదే
-మహిళా అభ్యున్నతికి సర్కారు పెద్దపీట
-పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని ముచ్చట్లు:
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తోందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మంగళవారం మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో నిర్వహించిన మహిళా బందు వేడుకల్లో ఆయన పాల్గొని పలువురిని సన్మానించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుట్ట మధు మాట్లాడుతూ
బారతమాతను పూజించే దేశంలో స్త్రీలను గౌరవించే సంస్కృతి మనదని ఆయన అన్నారు. ఈ క్రమంలో ప్రతి మహిళను గౌరవిస్తూ వారి సేవలకు గుర్తింపు తీసుకువచ్చే విదంగా అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  గొప్పగా ఆలోచన చేసి మూడు రోజుల పాటు సంబరాలకు పిలుపునిచ్చారని ఆయన తెలిపారు. రాజకీయంగా,ఆర్థికంగా మహిళల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ క్రమంలో అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఇందులో  బాగంగా మహిళల కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథపథకాన్ని ప్రవేవపెట్టిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాలకుల నిర్లక్ష్యం మూలంగా ప్రతి ఆడబిడ్డ అనేక కష్టాలు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు  చేశారు. కిలోమీటర్ల మేర కాలినడకన మంచినీళ్లబిందెలు మోసుకునే రోజులకు ముఖ్యమంత్రికేసీఆర్ స్వస్తిపలికారని, ఇంటి వద్దకే మంచినీళ్లను అందిస్తున్న ఘనత ఈ సర్కారుదేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో ఆడబిడ్డ సంతోషంగా ఉంటే ఆకుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుందని, ఈ క్రమంలో కోడలును ప్రేమించే సంస్కృతి రావాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్బంగా మహిళా ప్రజాప్రతినిధులు, ఆశావర్కర్లను ఘనంగాసన్మానించారు. సర్పంచ్  చేన్నవేన సదానందం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, జెడ్పిటిసి తగరం సుమలత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాంభట్ల సంతోషిని, సింగిల్విండో చైర్మన్ కొత్తశ్రీనివాస్, ఎంపీటీసీ పెండ్రు చైతన్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు తగరం శంకర్ లాల్,ఎక్కేటి అనంతరెడ్డి, పెండ్రు ప్రభాకర్ రెడ్డి, సదానందం ల తో పాటుస్థానిక నాయకులు పాల్గొన్నారు.
 
Tags:The TRS government is giving special recognition to women in all walks of life

Natyam ad