The Union Minister who made the wrong comments on the constitution should be removed from office.

రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించాలి.

దళిత సంఘ నాయకుల ధర్నా

Date : 27/12/2017

వి.కోట ముచ్చట్లు :

భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి పదవీ భాద్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి అదే రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ దళిత సంఘ నాయకులు బిఎస్పీ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆద్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌ కూడలిలో ధర్నా నిర్వహించారు. కర్ణాటక కు చెందిన బిజెపి కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా సవరించడానికి, మార్పులు చేసుకునే హక్కు, అధికారం ఒక్క బిజెపి పార్టీకే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగాన్ని కించపరిచిన మంత్రిని వెంటనే పదవినుంచి తొలగించి పార్టీ సభ్యత్వం నుంచి శాశ్వతంగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 66 సం.లు గడుస్తున్నప్పటికీ దళిత బహుజనులపై అణచివేత దాడులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రధాని మోడీకి,బిజెపి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగాన్ని హేళన చేసిన మంత్రిని తొలగించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణపతి, సురేంద్ర, వినోద్ కుమార్, సతీష్, రవి, వసంత్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags: The Union Minister who made the wrong comments on the constitution should be removed from office.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *