టీమిండియాను ఊరిస్తున్న విజయం

ఢిల్లీముచ్చట్లు:
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తోంది. భారత్ నిర్దేశించిన 410 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంకేయులు 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీతున్నారు. సదీరా సమరవిక్రమా(5), కరుణరత్నే(13), లక్మల్(0)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరి నిరాశపరిచారు. ఈ మూడు వికెట్లలో రెండు జడేజా సాధించగా, మరొక వికెట్ షమీకి దక్కింది. మరొకవైపు వెలుతురు మందగించడంతో నాల్గో రోజు ఆటను ముందుగానే ముగించారు. నాల్గో రోజు ఆట ముగిసేసమయానికి దనంజయ డిసిల్వా(13 బ్యాటింగ్), మాథ్యూస్(0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఇంకా 379 పరుగులు వెనుకబడి ఉన్న లంకేయులు చివరి రోజు ఆటలో సుదీర్ఘ పోరాటం చేస్తే కానీ ఓటమి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే. శ్రీలంకతో మూడో టెస్టులో భారత తన రెండో ఇన్నింగ్స్‌ను 246/5 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో భారత్‌కు 409 పరుగుల ఆధిక్యం లభించింది. మంగళవారం నాల్గో రోజు ఆటలో టీ విరామం తరువాత రోహిత్ శర్మ (50 నాటౌట్) హాఫ్ సాధించిన పిదప భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు విరాట్ కోహ్లి(50) హాఫ్ సెంచరీ సాధించి ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(67) హాఫ్ సెంచరీ చేయగా, చతేశ్వర పుజారా(49) పరుగు దూరంలో అర్థ శతకం కోల్పోయాడు. అటు తరువాత కోహ్లి-రోహిత్‌శర్మల జోడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 90 పరుగులు జోడించిన తరువాత కోహ్లి ఐదో వికెట్‌గా అవుటయ్యాడు. ఆపై రోహిత్ శర్మ అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నవెంటనే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు 356/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన లంక 5.3 ఓవర్ల వ్యవధిలోనే చివరి వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్ వేసిన 135 ఓవర్ మూడో బంతికి చండిమాల్(164) ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటవ్వడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ ఆదిలోనే రెండు వికెట్లుకోల్పోయింది. మురళీ విజయ్(9), అజింక్యా రహానే(10)లు నిరాశపరిచారు. కాగా, పుజారా, ధావన్, కోహ్లి, రోహిత్ శర్మలు రాణించి భారీ లక్ష్యాన్ని లంకేయులు ముందుంచడంలో సహకరించారు.
భారత్ తొలి ఇన్నింగ్స్ 536/7 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 246/5 డిక్లేర్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 373 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 31/3
Tag: The victory of the Indian team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *