The villagers of the Mahabharanyapalli blocked the House

జన్మభూమి సభను అడ్డుకున్న పెద్దభరిణేపల్లె గ్రామస్తులు

-అధికారుల గైర్హాజరు
-నాయకులతో నామ మాత్రంగా జన్మభూమి కార్యక్రమం
-పింఛనులు, రేషన్ కార్డులకు అర్జీలివ్వకుండా వెనుదిరిగిన ప్రజలు

వి.కోట ముచ్చట్లు :

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారంటూ మండలంలోని పెద్దభరిణేపల్లె గ్రామస్థులు జన్మభూమి సభను అడ్డుకున్నారు. గ్రామ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని అడిగితే మండల తెదెపా అధ్యక్షుడు నిర్లక్ష్యంగా సమాదానం చెప్పడంతో ఘర్షణ చోటుచేసుకుంది. హంద్రీ – నీవా కాలువ తవ్వకాల్లో గ్రామ చెరువును పూర్తిగా కోల్పోతామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గ్రామానికి సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు,నాయకులకు విన్నవించినా ప్రయోజనం లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేక అర్ధాంతరంగా సభను ముగించారు. పింఛనులు, రేషన్ కార్డులకు అర్జీలివ్వడానికి వచ్చిన ప్రజలు చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగారు.వెంగంవారిపల్లి,కడపనత్తం,గౌనితీమ్మేపల్ల, పంచాయతీ లో ఈరోజు జడ్పీటీసీ సభ్యురాలు రాధమ్మ గారు మరియు మండల పార్టీ అధ్యక్షుడు కిషోర్ గారు మరియు మండల అధికారులు, మరియు పార్టీజరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags : The villagers of the Mahabharanyapalli blocked the House

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *