The welfare schemes should be utilized

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Date: 10/01/2018

 The welfare schemes should be utilized

The welfare schemes should be utilized
 The welfare schemes should be utilized

The welfare schemes should be utilized

పెద్దపంజాణి ముచ్చట్లు :

రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ మురళీకృష్ణ కోరారు. మండల పరిధిలోని కోగిలేరు పంచాయితీలో జరిగిన 5వ విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెదేపా పాలనలో గ్రామీణాభివృద్ధి కోసం నీరు – చెట్టు, రైతురథాలు ఇవ్వడం, పింఛనులు ఇవ్వడం, మరుగుదొడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. జెడ్పీటీసీ సులోచన మాట్లాడుతూ మహిళలకు పసుపు కుంకుమ పథకం ద్వారా డ్వాక్రా గ్రూపులకు రూ. 10 వేలు ఇచ్చిన ఘనత తెదేపా కే దక్కుతుందన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యాదికారి రవిశంకర్ ఆద్వర్యంలో ప్రజలకు వైద్యసేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం, తహశీల్దారు సురేంద్ర బాబు, ఇతర శాఖల అధికారులు, ఎంపీటీసిలు, సర్పంచులు, మండల తెదేపా అధ్యక్షుడు శ్రీరాములు, నాయకులు రోజాక్రిష్ణారెడ్డి, మురహరిరెడ్డి, రామక్రిష్ణ, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: The welfare schemes should be utilized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *