భర్తను బాదేసిన భార్య

మంచిర్యాల ముచ్చట్లు:
 
ఆమె ఇంట్లో అణుకువగా ఉండే ఇల్లాలు. కుటుంబమే తన సర్వస్వం. పేద కుటుంబం కావడంతో కాపురంలో కలతలు ఉన్నా.. గుట్టుగా కష్టాలు భరిస్తూ ముందుకు సాగేది. కానీ భర్త రోజు తాగొచ్చి వేధిస్తున్నాడు. తనతో పాటు పిల్లల్ని కూడా కొడుతున్నాడు..తిడుతున్నాడు. రోజూ అతడి ఇంటికి వచ్చాడంటే పెద్ద గొడవ అవ్వాల్సిందే. పెద్ద మనుషులతో చెప్పించింది. మాట వినలా. వేధింపులు రోజురోజుకు పెరిగిపోయాయి. దీంతో విసుగు చెందిన ఆమె.. అపరకాళిగా మారింది. సోమవారం భర్తను విద్యుత్ స్తంభానికి కట్టేసి చితక బాదింది భార్య. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని రైల్వే రడగంబాల బస్తీలో.. తాగుబోతు భర్తపై దాడి చేసింది భార్య. నిత్యం తాగొస్తున్నాడని భర్తను విద్యుత్ స్తంభానికి కట్టేసి చితక బాదింది భార్య. అతని కొడుకు, కూతురు కూడా తల్లికే సపోర్ట్ చేశారు.  తిరుపతి అనే వ్యక్తి తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి.. ఇంట్లో భార్య పిల్లల్ని కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన భార్య శారద.. ఇద్దరు పిల్లలు.. తిరుపతిని కట్టేసి కొట్టారుఅయితే రోడ్డు మీద ఇలా దాడి చేయడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు స్థానికులు. తిరుపతి కట్లు విడిపించి.. సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బయట పిల్లుల్లా తిరుగుతూ.. ఇళ్లకు వెళ్లి భార్యలపై ప్రతాపం చూపే వీర మగాళ్లు..ఈ విషయం కాస్త మనసున పెట్టుకోని మొదలండి. ఆళికి సహనం లోపిస్తే..సీన్ రివర్స్ అవుతుంది.
దాడులను అరికట్టాలి
Tags: The wife who betrayed her husband

Natyam ad