శబరిమల ఆలయంలోకి మహిళ..అడ్డుకున్న అధికారులు

శబరిమల ముచ్చట్లు:

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 31ఏళ్ల వయసున్న ఓ మహిళ ప్రవేశించేందుకు యత్నించారు. ఆలయం ముందున్న పదునెట్టాంపడిని ఎక్కేందుకు సదరు మహిళ యత్నించగా, గుర్తించిన అధికారులు, పోలీసులు ఆమెను అడ్డుకుని వెనక్కి పంపారు. ఆమెను ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళగా గుర్తించారు. ‘నైస్తిక బ్రహ్మచర్యం’ సంప్రదాయం ప్రకారం 10-50ఏళ్ల వయసున్న స్త్రీలెవరికీ ఆలయంలోకి ప్రవేశం లేదు. ఆమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా వయసును గుర్తించి అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.’పదినెట్టాంపడిని ఎక్కుతుండగా ఓ మహిళను అడ్డుకున్నాం. ఆమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు ప్రకారం ఆమె వయసు 31 సంవత్సరాలని నిర్ధారణకు వచ్చాం. దీంతో ఆమెను అడ్డుకుని వెనక్కి పంపాం’ అని డిప్యూటీ కమిషనర్ సతీష్ బినో తెలిపారు. సదరు మహిళ తన కుటుంబ సభ్యులతో వచ్చినట్లు గుర్తించారు.సాధారణంగా శబరిమలకు వచ్చే మహిళల గుర్తింపుకార్డులను తనిఖీ చేసి, అనంతరం కొండపైకి పంపుతారు. కానీ, ఆ మహిళ పదునెట్టాంపడి వరకూ ఎలా వచ్చిందో తెలియరాలేదని అధికారులు తెలిపారు.

 

Tag : The woman in the Sabarimala temple


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *