పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి.

-ఓబిసి సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద  మహిళలు శాంతి దీక్ష
న్యూ డిల్లీ ముచ్చట్లు:
పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టి ,అందులో ఓ బి సి, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సబ్ కోటా కల్పించాలని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పురస్కరించు కొని  ఓబిసి సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో డిల్లి లోని జంతర్ మంతర్ వద్ద  మహిళలు శాంతి దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఓబిసి సెంట్రల్ కమిటీ చర్మెన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళా బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదింపజేయాలని డిమాండ్ చేసారు. గడచిన 26 సంవత్సరాలు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ  పార్లమెంటు లో మహిళా బిల్లు పెట్టక పోవడం  శోచనీయమన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓట్లు వేసుకుని అధికారంలో ఉంటూ  మహిళలకోసం తీసుక వచ్చిన బిల్లు ను ప్రవేశ పెట్టక పోవడం మహిలల పట్ల పాలకులకు ఉన్న నిర్లక్షాన్ని తెలియజేస్తుందన్నారు. ఓబిసి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ స్థానాలు లేకపోవడంవల్ల కష్టసుఖాలలో అండగా ఉంటారని అధికారంలో కూర్చోబెడితే చట్టాలను రుపొందించడంలో నిర్లక్షాన్ని కనబర్చుచున్నారని బాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం మేజర్ కమిటీలలో మహిళా ప్రాతినిధ్యం లేదని అన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో నే సాధికారత సాధిస్తామని చెప్పుకోవడం సోచనీయమన్నారు.అనంతరం  ఓబిసి సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ ఎన్.నిర్మల ముదిరాజ్ మాట్లాడుతూ అత్యాచారాలకు అన్యాయాలకు గురవుతున్న ఓబీసీ సమాజం ఈ దేశంలో 52 శాతం ఉన్నప్పటికీ నేటికి వివక్ష కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం  చేశారు. అన్ని రాజకీయ పార్టీలు మహిళల పట్ల తమ వైఖరిని ప్రకటించాలని, మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్మల ముదిరాజ్ డిమాండ్ చేశారు రానున్న పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంట్ సభల్లో అన్ని రాజకీయ పార్టీలు   మహిళలకు మద్దతు ప్రకటించి  ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో లో సిహెచ్ లత రెడ్డి, ఏ సువర్ణ, అల్వాల, పి పద్మావతి, ఎస్.రజిని, గున్న సంధ్య, స్వరూపరాణి, ప్రసన్న, డాక్టర్ ఎస్ కృష్ణారావు శైలేష్ కుమార్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
 
Tags:The Women’s Bill should be introduced in Parliament

Natyam ad