The young man committed suicide with a blade and committed suicide

బ్లేడుతో గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం

Date:24/11/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

అన్నదమ్ముల మధ్య మొదలైన గొడవ కారణంగా ఓ యువకుడు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని చామనేరు పంచాయతీ బండ్లకుంట గ్రామానికి చెందిన వెంకటముని కుమారుడు మంజునాథ్ శనివారం బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసాడు. స్థానికుల, 108 సిబ్బంది, కథనం మేరకు మంజునాథ్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసి జీవనం చేస్తున్నాడు. మంజునాథ్ తన అన్న సుబ్రహ్మణ్యంతో ఇంటినిర్మాణం విషయంలో గొడవపడ్డాడు. మనస్థాపానికి గురై మద్యం సేవించి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా బాధితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది కిషోర్, శివ గ్రామానికి చేరుకొని బాధితుడిని చికిత్స కోసం 108 అంబులెన్సు లో పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సిఉంది.

26న మున్సిపల్‌ మీట్‌

Tags:The young man committed suicide with a blade and committed suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *