పిడుగు పాటుకు యువకుడు మృతి.

Date:27/05/2018

చిత్తూరు జిల్లా ముచ్చట్లు :

చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం యమగానిపల్లె గ్రామ పంచాయితీ సోలప్పగారి కొట్టాలు గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిని భారీ వర్షానికి పిడుగు పడి చంద్రప్ప కుమారుడు హరీష్ (25)యువకుడు మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం కొద్దిపాటి తొలకరి పడి ఆగిపోవడంతో తమ మేడపైకి వచ్చిన హరీష్ పై పిడుగు పడడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పిడుగు పాటు శబ్దానికి మేడ సైతం నెర్రలివ్వడంతో ఇంటిలోని కుటుంబ సభ్యులు హుటాహుటిన మేడపైకి రావడంతో అప్పటికే హరీష్ మృతి చెందాడు. జీవనోపాధి కోసం కర్ణాటక రాష్ట్రంలో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న హరీష్ కుప్పంలో గంగ జాతర నిమ్మితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో సోమవారం బెంగళూరుకు ఉపాధి కోసం వెళ్ళవలసిన హరీష్ ఇలా మృత్యు వాత పడడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags:The young man died in a thunderbolt.

 

The young man died in a thunderbolt.
The young man died in a thunderbolt.
The young man died in a thunderbolt.
The young man died in a thunderbolt.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *