Natyam ad

ఉక్రెయిన్‌లో ఇంకా 16వేల మంది భార‌తీయ విద్యార్థులు

-ఉక్రెయిన్ సంక్షోభంపై ప్ర‌ధాని ఉన్న‌త స్థాయి స‌మావేశం.
న్యూఢిల్లీ   ముచ్చట్లు:
ఉక్రెయిన్ సంక్షోభంపై ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భార‌తీయ విద్యార్థుల‌ను త‌ర‌లించే అంశంపై ఆయ‌న చ‌ర్చించారు. అయితే ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం మేర‌కు కొంద‌రు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ స‌రిహ‌ద్దు దేశాల‌కు విజిట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మంత్రులు హ‌రిదీప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింథియా, కిర‌ణ్ రిజిజు, వీకే సింగ్‌లు.. భార‌తీయ విద్యార్థుల‌ను తీసుకువ‌చ్చేందుకు విదేశాల‌కు వెళ్ల‌నున్నారు. ఉక్రెయిన్‌లో ఇంకా దాదాపు 16వేల మంది భార‌తీయ విద్యార్థులు చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. బంక‌ర్లు, బాంబు షెల్ట‌ర్లు, హాస్ట‌ల్ బేస్‌మెంట్‌దలో వాళ్లంతా త‌ల‌దాచుకుంటున్నారు. గ‌త గురువారం ర‌ష్యా దాడులు ప్రారంభించ‌డానికి ముందు కొంత మంది విద్యార్థులు ఉక్రెయిన్ వీడి వ‌చ్చారు. మ‌రో వైపు విద్యార్థుల‌ను ర‌క్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలేద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
 
Tags:There are another 16,000 Indian students in Ukraine