చిత్తూరులో మరో నాలుగు నియోజకవర్గాలు

Date:14/02/2018
తిరుపతి ముచ్చట్లు:
నియోజకవర్గాల పెంపు ఉంటుందా ..? ఉండదా..? అన్న విషయాన్ని పక్కన పెడితే ఏపీలో మాత్రం నియోజకవర్గాల పునర్విభజన ఖాయమనే అభిప్రాయంతో ఉన్నారు నేతలు! తమకు అనుకూలంగా  కొత్త నియోజకవర్గాలు ఉండేట్టుగా చూసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నేతలైతే మరీనూ…!  ప్రస్తుతం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకవేళ పెంపు జరిగితే మాత్రం ఓ నాలుగు కొత్తవి రావచ్చు.. ఆ నాలుగు ఎక్కడ అన్నదాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టత ఉంది.. ఇదివరకే ఆయన ఈ విషయంలో హోమ్‌వర్క్‌ చేసి ఉన్నారు. కాకపోతే ఆ నాలుగింటి కోసం టీడీపీ నేతల మధ్య పోటీ తీవ్రమయ్యింది.. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఆ కొత్తవాటిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. పునర్విభజన అన్నది కేంద్రం చేతిలో ఉంది కాబట్టి.. జిల్లాను యూనిట్‌గా చేసుకుని నియోజకవర్గాలను పెంచుతారా..? లేక లోక్‌సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని పెంచుతారా? అన్నది తెలియదు.. చిత్తూరు జిల్లా మూడు లోక్‌సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉంది.. చిత్తూరు.. తిరుపతి పార్లమెంట్‌ స్థానాలే కాకుండా జిల్లాలో కొంతభాగం కడప జిల్లాకు చెందిన రాజంపేట కూడా లోక్‌సభ పరిధిలో ఉంది.. అయితే చిత్తూరు.. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో పార్లమెంట్‌ పరిధిలో రెండేసి కొత్త అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 14 నియోజకవర్గాలలో పూతలపట్టు.. గంగాధరనెల్లూరు.. సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలుగా ఉన్నాయి. మిగిలినవి జనరల్‌ కేటగిరిలో ఉన్నాయి. అయితే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల నుంచే కొత్తవాటిని ఏర్పాటు చేయవచ్చు.. ఇదే ప్రాతిపదిక అయితే మాత్రం పలమనేరు.. చిత్తూరు.. చంద్రగిరి… పీలేరు.. నగరి… తిరుపతి నియోజకవర్గాలలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గాల నుంచి కొత్త నియోజకవర్గాలు ఏర్పడవచ్చు. పలమనేరు నియోజకవర్గం పరిధిలోని వి.కోటను.. చిత్తూరు పరిధిలోని చిత్తూరు రూరల్‌ను.. చంద్రగిరి పరిధిలోని తిరుపతి రూరల్‌ను… నగరి పరిధిలోని పుత్తూరును.. పీలేరు పరిధిలోని కలికిరిని కొత్త నియోజకవర్గాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు టీడీపీ నేతలు.. వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్‌ను చిత్తూరు జిల్లా నుంచే పోటీ చేయించాలన్నది టీడీపీ అధిష్టానం ఆలోచన! జిల్లా పార్టీ నేతల ఉత్సాహానికి కారణం కూడా అదే! లోకేశ్‌ పలమనేరు నుంచి పోటీ చేస్తానంటే.. తాను పుంగనూరుకు షిఫ్టవుతానని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి అధిష్టానంతో చెప్పారట! నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అమర్‌నాథ్‌రెడ్డి… ఆయన తండ్రి రామకృష్ణారెడ్డి అనేకమార్లు పుంగనూరు నుంచే పోటీ చేసి గెలిచారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నుంచి లోకేశ్‌ను బరిలో దింపితే గ్రూపు రాజకీయాలు ముగిసిపోతాయని అనుకుంటున్నారు జిల్లా నేతలు!
Tags: There are four other constituencies in Chittoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *