పుంగనూరు పెన్షన్‌దారుల్లో ఆనందానికి హద్దులులేవ్‌

పుంగనూరు ముచ్చట్లు:
 
పేద లబ్ధిదారులకు అందజేస్తున్న పెన్షన్‌ రూ.250 లు పెంపు చేసి రూ.2500 గా ఇవ్వడంతో పెన్షన్‌దారుల్లో ఆనందానికి అవదులు లేకుండ పోయిందని ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం నూతన సంవత్సర తొలిరోజు మండలంలోని ఆరడిగుంట, వనమలదిన్నె, మాగాండ్లపల్లెలో జెడ్పిటిసి జ్ఞానప్రసన్నతో కలసి పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం కలసి పెన్షన్లు పంపిణీ చేశారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి హామి ఇచ్చిన మేరకు పెన్షన్లు పెంపు చేసి, అర్హులైన పేదలను ఆదుకోవడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఎంపీడీవో లక్ష్మీపతి, కమిషనర్‌ రసూల్‌ఖాన్‌, సర్పంచ్‌ మునస్వామి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు నటరాజ, మమత, త్యాగరాజు, జేపి యాదవ్‌, వైఎస్సార్‌సిపి నాయకులు జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌ , రాజేష్‌, సురేష్‌ పాల్గొన్నారు.

పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags:There are no limits to happiness among Punganur pensioners

Natyam ad