పొలిటికల్ ఎంట్రీకి అవకాశం లేదు

Date:19/06/2018
రాజమండ్రి ముచ్చట్లు:
లోక్ సభలో ప్రధాని మాటలనే ఉండవల్లి ఏపీకి అన్యాయం చేశారంటూ వేసిన కేసులో సుప్రీం లో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. నిండు సభలో ప్రధాని మోడీ ఆంధ్రకు తలుపులు మూసి మరీ అన్యాయం చేశారని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. సాక్షాత్తు దేశ ప్రధాని లోక్ సభలో చెప్పారంటే రాజ్యాంగ విరుద్ధంగా విభజన జరిగిందనేది స్పష్టం అయ్యిందన్నారు ఉండవల్లి. అదే ప్రసంగాన్ని సాక్ష్యంగా తీసుకోవాలని కోర్టును కోరానని చెప్పారు ఆయన. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ మరోసారి గళం విప్పారు. తనతో అన్ని పార్టీలవారు బాగా ఉంటారని తాజాగా టిడిపికి చెందిన సిఎం రమేష్ కడప స్టిల్ ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష చేస్తా మద్దత్తు కోరారారని ఆయనకు తన సపోర్ట్ గ్యారంటీ అన్నారు అరుణ కుమార్. తాను ఏ పార్టీలో చేరాలని భావించడం లేదని ముఖ్యంగా కాంగ్రెస్ వెనక్కు పిలిచిందన్న వార్తల్లో నిజం లేదని తేల్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ముద్దాయిగా సుప్రీంలో విభజన కేసు దాఖలు చేశానని ఆ కేసునుంచి విత్ డ్రా కాకుండా కాంగ్రెస్ ఎలా చేర్చుకుంటుందని ఉండవల్లి ప్రశ్నించారు. కేసు ఉపసంహరించుకునే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేశారు. కనుక కాంగ్రెస్ లో చేరే ప్రసక్తి లేదన్నారు ఆయన.
ఏ రాజకీయ పార్టీలో ఉండను కానీ రాజకీయాల్లో ఉండనని చెప్పబోనని అన్నారు అరుణ కుమార్. అలాగే పదవి అంటే ఉద్యోగమని, 10 ఏళ్ళు ఎంపిగా సంతృప్తిగా పని చేశా అని ఇక పదవులకోసం పార్టీల్లో చేరే పని లేదన్నారు. ఎమ్యెల్యే , ఎంపీలు ఉద్యోగులేనని జీతం తీసుకుంటారు కనుక ప్రజల కోసం పనిచేయాలిసిందే నన్నారు. రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే స్థాయి లేదని కడవరకు రాజమండ్రి ప్రెస్ తో వున్న అనుబంధం వల్ల తన అనుభవాలు పంచుకుంటానని వెల్లడించారు ఉండవల్లి. తనకున్న వారు అనుచరులు కాదని సహచరులు, స్నేహితులేనని తనతో కాంగ్రెస్ పార్టీ లో ప్రయాణించిన రౌతు సూర్య ప్రకాశరావు, వైసిపిలో కందుల దుర్గేష్ కాంగ్రెస్ లో 2014 ఎన్నికల ముందే  వెళ్లి పోవడాన్ని గుర్తు చేస్తూ ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా ఇబ్బంది లేదన్నారు. నాకెవ్వరు శత్రువులు లేరని టిడిపి తో సహా విరోధి భావన గతంలో వున్నా ఇప్పుడు ఏమీ లేదన్నారు ఆయన. జనసేన అప్పగించిన విధి పూర్తి అయ్యిందని 76 వేలకోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలిసింది ఉందని నిజనిర్ధారణ కమిటీ తేల్చిందన్నారు.ఎపి సీఎం కి 2015 నుంచి ప్రెస్ మీట్ల ద్వారా చెబుతున్నానని, గొడవ పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడామని మొత్తుకున్నా ప్రయోజనం లేదని అరుణ కుమార్ వ్యాఖ్యానించారు. మనకి చాలా ఆలస్యం అయ్యిందని పోలవరం ముంపు మండలాలు కలిపినట్లు ఆర్డినెన్స్ ద్వారా హోదా తెచ్చుకుని ఉంటే సరిపోయేదని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ రాజీ పడటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు.
Tags:There is no chance of political entry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *