ఆన్లైన్ దర్శన టికెట్ల జారీలో ఎలాంటి కుంభకోణం లేదు
తిరుమల ముచ్చట్లు:
ఆన్లైన్ దర్శన టికెట్ల జారీలో భారీ కుంభకోణం జరిగినట్టు తెలంగాణకు చెందిన ఒక తెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్త అవాస్తవం.టిటిడి విజిలెన్స్ విభాగం ఆన్లైన్, ఆఫ్‌లైన్ దర్శన టికెట్ల జారీపై నిఘా ఉంచుతుంది. టికెట్ల కేటాయింపులో ఎలాంటి అక్రమాలు జరిగే అవకాశమే లేదు. ఆన్లైన్లో టికెట్లు జారీ చేసిన గంటలోపే భక్తులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. టిటిడి క్లౌడ్ టెక్నాలజి ద్వారా ఆన్లైన్లో దర్శన టికెట్లు విడుదల చేస్తున్నందువల్ల భక్తులు చాలా వేగంగా వీటిని పొందగలుగుతున్నారు. అంతే కానీ ఇందులో ఎలాంటి మతలబులు మరొకటి లేవు. కనుక భక్త్తులు ఇటువంటి వార్తలను నమ్మవద్దని కోరడమైనది. ఊహాజనిత ఆరోపణలతో కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: There is no scam in the issuance of tickets for online viewing