రెంటికి చెడ్డ రేవడిలా రావెల

Date:16/03/2018
గుంటూరు ముచ్చట్లు:
రెండింటికీ చెడ్డ రేవ‌డిలా మారిపోయింది టీడీపీ ఎమ్మెల్యే ప‌రిస్థితి! ఒక‌ప‌క్క టీడీపీలోనే ఎవ‌రూ ఆయ‌న్ను న‌మ్మ‌డం లేదు. తొలిసారి ఎమ్మెల్యే అయినా, మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టినా త‌నకంటూ సొంత బ‌లాన్ని త‌యారుచేసుకోవ‌డంలో ఆయ‌న విఫ‌ల‌మ‌య్యారు. అంతేగాక సొంత పార్టీలోనే వ్య‌తిరేక వ‌ర్గాన్ని కూడ‌గ‌ట్టుకున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌ద‌ని తెలుసుకున్న ఆయ‌న‌.. టీడీపీ నేత‌ల‌పైనే విమ‌ర్శ‌లు గుప్పిస్తూ అధిష్టానానికి చికాకులు తెప్పిస్తున్నారు. అంతేగాక ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిపోదామ‌ని ఆయ‌న తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ పార్టీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతున్నారు. ఆయ‌న ట్రాక్ రికార్డు గ‌మ‌నించిన వీరు కూడా.. ఏ విధ‌మైన రెస్పాన్స్ ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. అటు టీడీపీలో ఉండ‌లేక‌… ఇటు వైసీపీలోకి వెళ్ల‌డంలో ఇబ్బందులు రావ‌డంతో ఆయ‌న రాజ‌కీయ జీవితం ఇక ముగిసిపోయిన‌ట్లేన‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు పార్టీ జెండా ఒక్క రోజు మోయ‌లేదు. ఆయ‌న‌కు పార్టీలో స‌భ్య‌త్వ‌మే లేదు. కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో అధికారి కావ‌డంతో చంద్ర‌బాబు అప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌పున క‌ష్ట‌ప‌డడంతో పాటు రెండుసార్లు ఓడిన కందుకూరి వీర‌య్య‌ను ప‌క్క‌న పెట్టేసి మ‌రీ ఆయ‌న‌కు చివ‌రి క్ష‌ణంలో రావెల‌కు సీటు ఇచ్చారు. అనూహ్యంగా గెలిచిన ఆయ‌న‌.. కొద్ది రోజుల్లోనే మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కించేసుకున్నారు. అయితే మంత్రి అయ్యాక ఆయ‌న ఎవ్వ‌రినీ లెక్క చేయ‌క‌పోవ‌డం, అంద‌రూ త‌న వ‌ద్ద‌కే రావాల‌న్న భావంతో వ్య‌వ‌హ‌రించ‌డం, చివ‌ర‌కు ఆయ‌న కుమారుల తీరు వివాస్ప‌దం కావ‌డంతో ఆయ‌నతో పాటు పార్టీ అప్ర‌తిష్ట మూట‌గ‌ట్టుకుంది. ఇదే మంత్రి ప‌ద‌విని దూరం చేసింది.ఇక మంత్రి ప‌ద‌వి పోయిన‌ప్ప‌టి నుంచి రావెల వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు టీడీపీలోనే మ‌రిన్ని అనుమానాల‌కు కార‌ణ‌మైంది. సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని నేత‌ల‌ను పట్టించుకోక‌పోవ‌డం.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో ట‌చ్‌లో ఉండ‌టంతో గుర్రుగా ఉన్నారు. దీంతో జిల్లా పార్టీ నుంచి, స్టేట్ పార్టీ, చివ‌ర‌కు ఇంటిలిజెన్స్ రిపోర్టులు కూడా ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ లేద‌ని చెప్పేస్తున్నాయ‌ట‌. ఆయ‌న వైసీపీలో చేరిపోతార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగిపోయింది. ఆ పార్టీ నేత‌ల‌తో మంత‌నాలు కూడా కొన‌సాగిస్తున్నారు. ఇక రేపో మాపో పార్టీలో చేరిపోవ‌డం ఖాయ‌మ‌ని భావించిన ఆయ‌న‌కు ఎప్ప‌టికీ.. వైసీపీ నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ రావ‌డం లేద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.ఆయన వైసీపీకి ఎంత మేలు చేసే కార్యక్రమాలు చేసినా..అక్కడి నుంచి సానుకూలత లభించడం లేదట. పార్టీలోకి రమ్మంటే.. వస్తానని సంకేతాలు పంపించినా.. ఆ పార్టీ నాయకులు పట్టించుకోవ‌డం లేద‌ట‌. దీంతో ఇప్పుడు ఏమి చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట. టీడీపీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా… జారవిడిచిన ఆయ‌న‌.. రాజకీయ జీవితం దాదాపు ముగిసి పోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Tags: They are like a bad smile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *