పుంగనూరు జగనన్న కాలనీలలో పనులు వేగ వంతం – కమిషనర్ రసూల్‌ఖాన్
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని నక్కబండ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న జగనన్నకాలనీలలో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ రసూల్‌ఖాన్ తెలిపారు. సోమవారం ఆయన, హౌసింగ్ డీఈ నరసింహాచారి, టీపీఎస్ కిరణ్మయి కలసి కాలనీలను పరిశీలించారు. లబ్ధిదారులకు అవసరమైన మెటిరియల్ అందించి , నిర్మాణాలు పూర్తి చేయిస్తామన్నారు. లబ్ధిదారులు నిర్మాణాలు త్వరగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడ్కో ఇన్చార్జ్ రవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Things are speeding up in Punganur Jagannath Colonies – Commissioner Rasool Khan