“పెదపాడు” లో  దాహార్తి సమస్య తీర్చాలి

-గిరిజన సంఘం
విశాఖపట్నం ముచ్చట్లు:
డుంబ్రిగూడ మండలంలోని పోతంగి మేజర్ పంచాయతీ పరిధిలో గల   పెదపాడు గ్రామంలో నెలకొన్న  తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. సూర్య నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆ గ్రామాన్ని సందర్శించి గిరిజనుల నుండి  గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోతoగి పంచాయితీ పరిధిలో ఉన్న పెదపాడు గ్రామం లో సుమారు 400 మంది పి టి జి ఆదివాసులు నివసిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే ఇప్పటికీ  గ్రామంలోని సరైన తాగునీటి సౌకర్యం లేదని ఆయన తెలిపారు. కొండవాగు లనుండి  ప్రవహించే  నీటిని ఉపయోగిస్తున్నారని, ఫలితంగా  ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కులేని ఆ గ్రామ పి టి జి ఆదివాసులు మరోమార్గం లేక ఆ కలుషిత నీటిని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారని, అయితే వేసవి  సమిపిస్తే ఆ నీరు కూడా దొరకలేని దౌర్భాగ్య పరిస్థితిలో గిరిజన జీవనం సాగిస్తున్నారని ఆయన తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు పంచాయితీ, మండల స్థాయి అధికారులకు ప్రజాప్రతినిధులకు, వినతులు సమర్పిస్తున్న ప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆయన తెలిపారు. తక్షణమే పాడేరు ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి చొరవ చూపి పెదపాడు గ్రామంలో గల తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో   గ్రామ వార్డు సభ్యులు హరి, భాస్కర్ రావు, శిరీష, రాధా, పద్మ తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Thirsty in “Pedapadu” should solve the problem

Natyam ad