చరిత్రలో ఈ రోజు/జనవరి 13

Date: 13/01/2018

This day in history / January 13

This day in history / January 13

* 1610 : గెలీలియో బృహస్పతి 4వ ఉపగ్రహమైన కాలిస్టోను కనుకొన్నాడు.
* 1879 : ‘లయన్స్‌ క్లబ్‌’ స్థాపకుడు మెల్విన్‌ జోన్స్‌ జననం.
þ 1888 : వాషింగ్టన్‌ నగరంలో నేషనల్‌ జాగ్రఫిక్‌ సొసైటీ స్థాపించబడింది.
þ 1919 : ఆంధ్రప్రదేశ్‌ పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి జననం.
þ 1930 : వాల్ట్‌డిస్నీ సృష్టించిన కార్టూన్‌ పాత్ర ‘మిక్కీ మౌస్‌’ కామిక్‌ స్ట్రిప్‌ తొలిసారి ఓ పత్రికలో ప్రచురితమైంది.
þ 1938 : డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతానికి చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ఆమోదం లభించింది.
þ 1948 : గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.
þ 1949 : భారతీయ వ్యోమగామి రాకేశ్‌ శర్మ జననం.
þ 1977 : ఆంగ్ల సినీ నటుడు ఒర్లాండో బ్లూమ్‌ జననం.
þ 1983 : భారతీయ సినిమా నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌ జననం.

‘పైడి’ పలుకులు…
þ వివేకంతో కూడిన ఉపన్యాసం వాగ్ధాటి కంటే మెరుగైంది.
þ మర్యాదాగుణం మిమ్మల్ని సుంకం లేకుండా ఎత్తుకు ఎదగనిస్తుంది.
þ అజ్ఞానం నుండే భయం అన్నది ఎల్లప్పుడూ మొలకెత్తుతుంటుంది.
þ ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు. ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు.
þ ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును.
þ చక్కటి గుణశీలాలు కలిగిన వ్యక్తి తనకు ఇవ్వబడినది ప్రతి హదాకు తగిన వ్యక్తి అనిపించుకుంటాడు.
þ మీరు చేయలేనిదాన్ని మీరు చేయగలిగిన దానితో జోక్యం చేసుకోవడానికి అనుమతించకండి.
þ మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.
þ ఇతరులకు హాని చేసే ముందే క్రోధం నీకు హాని కలిగిస్తుంది.
þ ఇతరులను జయించాలనుకోకు. నిన్ను నీవు జయించు. అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది.
þ గొప్ప వక్తలు గొప్పకర్తలు కారు.
þ నలభై సంవత్సరాల వయసు యువత ముసలితనం అయితే 50 సంవత్సరాల వయసు ముసలితనపు యువత అవుతుంది.
þ నీతో వ్యర్ధ ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా వ్యర్ధ ప్రసంగం చేస్తాడు.
þ అలవాటును ప్రతిఘటించకపోతే అది మనకు అత్యవసరమైనది కాగలదు.
þ గతం త్రవ్వకండి. వర్తమానంలో పనిచేస్తూ భవిష్యత్తు నిర్మించండి.

Tags: This day in history / January 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *