This day in history / January 14

చరిత్రలో ఈ రోజు/జనవరి 14

date: 14/01/82018

* ఇస్లామీయ కేలండర్‌ ప్రకారం మూడవ నెల అయిన రబీ ఉల్‌ అవ్వల్‌ 12న ముహమ్మద్‌ ప్రవక్త మక్కాలో జన్మించారు. ఈయన జయంతినే మీలాదె నబి అనీ అంటారు. ఈ తేదీనే వీరు పరమదించారు కూడా.
* 1742 : ప్రఖ్యాత ఖగోళ, భౌతిక, భూగర్భ, గణిత శాస్త్రవేత్త, మెటెరాలజిస్టు ఎడ్మండ్‌ హేలీ మరణం. (జ.1656)
* 1857 : ఇండియన్‌ బ్యాంకు, ‘హిందూ’ పత్రికల వ్యవస్థాపకుల్లో ఒకడైన న్యాపతి సుబ్బారావు జననం.
* 1875 : ఉత్తమ సేవాదృక్పదం కలిగిన వైద్య నిపుణుడు, నోబెల్‌ బహుమతి గ్రహీత ఆల్బర్ట్‌ స్విట్జర్‌ జననం.
* 1892 : ‘గ్రాండ్‌ ఓల్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌’గా పేరొందిన దినకర్‌ బల్వంత్‌ దేవధర్‌ జననం.
* 1896 : స్వతంత్ర భారతదేశపు తొలి రిజర్వ్‌ బాంక్‌ గవర్నర్‌ సి.డి.దేశ్‌ముఖ్‌ జననం. (మ.1982)
* 1937 : ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు శోభన్‌బాబు జననం.
* 1951 : తెలుగు సినీ రచయిత, దర్శకుడు, హాస్య బ్రహ్మ జంధ్యాల జననం, (మ.2001).
* 1937 : ప్రఖ్యాత తెలుగు సినీ నటుడు రావు గోపాలరావు జననం. (మ. 1994).
* 1969 : మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చారు.
* 1987 : దూరదర్శన్‌ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాద్‌ నుంచే ప్రారంభమయ్యాయి.

Tags: This day in history / January 14

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *