This is the conspiracy: Vishnu Kumar king

ఇదంతా కుట్ర : విష్ణు కుమార్ రాజు

Date:13/02/2018
విశాఖపట్నం ముచ్చట్లు:
బీజేపీ ఎమ్మెల్యే  విష్ణుకుమార్ రాజు మరోసారి టీడీపీపై విరుచుకపడ్డారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడుతూ బయట ఎలా వ్యవహరించాలనే అంశంపై టిడిపి ఎంపీలకు శిక్షణ ఇవ్వాలని చురకలు అంటించారు. చిత్తూరు ఎంపి  శివప్రసాద్ బట్టలు విప్పుకుని ఆందోళన చేయడంతో మహిళా ఎంపిలు ఇబ్బందులు పడ్డారంటూ వ్యాఖ్యనించారు. ఎపికి 24 గంటల విద్యుత్ బీజేపి చలవే. కొన్ని పార్టీలు ప్రజల్లో తప్పుడు సమాచారం పంపి బీజేపీని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి కుట్రలను తిప్పికొడతాం. అసెంబ్లీలో తనకు కేటాయించిన గది అష్టవంకర్లతో ఉంది. టీడిపి నేతలకు కేటాయించిన గదులు బాగానే ఉన్నాయి. విషయాలను డైవర్ట్ చేసేందుకు కొన్ని పార్టీలు కలిసి డ్రామాకు తెరలేపాయని అయన అన్నారు.
Tags: This is the conspiracy: Vishnu Kumar king

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *