ఈసారి ఒంటరిగానే : సీపీఎం తమ్మినేని వీరభద్రం

Date:14/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
నల్గొండ లో పార్టీ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా పూర్తి చేసాం. పార్టీ సెక్రెటరియేట్ మీటింగ్ లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానలపై చర్చించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన విషయాలపై కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి   అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. రెండు నెలల్లో జరుగబోయే అఖిలభారత మహా సభలు ఏ విదంగా జరగాలి అనే దానిపై చర్చించాం. పార్టీ  సాహిత్యాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెమినార్ లు, అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ లపరిస్థితిపై చర్చించాం. రాబోయే రోజుల్లో ఏ పార్టీ తో పొత్తు ఉండబోదు. అఖిలపక్షం లోకి సీపీఎం వస్తుందని కొన్ని పత్రికల్లో రాసారు అది వాస్తవం కాదు.ఏ పార్టీ తో పొత్తు ఉండదు. వామపక్ష, ప్రజా తంత్ర  శక్తులను ఏక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, టి.ఆర్.ఎస్ వల్ల ప్రజలకు జరిగిన మేలు ఎం లేదు.కాబట్టి మరో  ప్రత్యామ్నాయంగా మీ  ముందుకు వస్తున్న బీఎల్ ఎఫ్ ని ప్రజలు ఆదరించాలి. సంగారెడ్డి జిల్లా లో బీఎల్ ఎఫ్  సభ జరుగనుంది ఈ నెల 26 న మహబూబ్నగర్ లో  బి.ఎల్.ఎఫ్  అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ లో సభ జరుగుతుందని అయన వెల్లడించారు.
Tags: This time alone: ​​Veerabhadram of CPM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *