తెలంగాణలో ఆ ఫలితాల ప్రభావం ఉండదు-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ ముచ్చట్లు:
 
గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలపై మంధని ఎమ్మెల్యే  శ్రీధర్ బాబు స్పందించారు.  కాంగ్రెస్ లోపాలు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది.  పంజాబ్ లో అంతర్గత పంచాయతీ లు సమస్య కాదు.
పార్టీ లో భిన్నాభిప్రాయాలు సహజం. పంజాబ్ పక్కనే ఉన్న ఢిల్లీ ప్రభుత్వం కి ఎట్రాక్ట్ అయ్యారు. తెలంగాణ లో బీజేపీ కి ప్లేస్ లేదు .. బలమైన పార్టీ కాంగ్రెస్. అధిష్టానం ఐదు రాష్ట్రాల ఫలితాల తో పాఠం
నేర్చుకోవాలని అన్నారు.సిఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానిస్తూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. పంజాబ్ లో అమరేందర్ సింగ్ పాలన బాలేదని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. చేయి దాటిపోయాక మా నాయకులు చర్యలుతీసుకున్నారు. అందుకే పంజాబ్ లో ఓడిపోయాము. ఆ రాష్ట్రాల ఫలితాలు తెలంగాణ లో ప్రభావం ఉండదని అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ బలంగా ఉంది .. ఇక్కడ అధికారంలోకి వస్తాం. తెలంగాణ లోనాయకుల మధ్య అంతర్గత విభేదాలు లేవు. అంశాల పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు.
 
Tags: Those results will not have an impact in Telangana-Congress MLAs

Natyam ad