మూడు వర్గాలు..ఆరు గ్రూపులు

Date:13/02/2018
ఒంగోలు ముచ్చట్లు:
సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ రాజకీయం మరోసారి రచ్చకెక్కింది. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ తెలుగుతమ్ముళ్ల సమీక్షాసమావేశం స్థానిక ఎన్‌ఎస్‌పి అతిధిగృహంలో రాష్టశ్రిశు సంక్షేమశాఖమంత్రి పరిటాల సునీత నిర్వహించారు. ఈసమావేశంలో సంతనూతలపాడు, అద్దంకి, చీరాల నియోజకవర్గాలకు చెందిన శాసనసలు, ఇన్‌చార్జులు బిఎన్ విజయకుమార్, గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. కాగా శాసనమండలి సభ్యులు పోతుల సునీత, కరణం బలరామకృష్ణమూర్తి హాజరుకాలేదు. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన రాజకీయ రచ్చకు తెరపడినట్లైంది. తాజాగా మరోసారి సంతనూతలపాడు రాజకీయం తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలోని సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాలకు చెందిన బిఎన్ వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం నాయకులు హాజరయ్యారు. కాగా బిఎన్ విజయకుమార్‌కు చెందిన అనుకూల వర్గానికే సమావేశానికి హాజరుకమ్మని పిలుపురాగా ఆయన వ్యతిరేక వర్గానికి పిలుపులేదు. దీంతో సమావేశం ఉందని తెలుసుకున్న బిఎన్ వ్యతిరేక వర్గం పరిటాల సునీత ముందు తమగోడును వెళ్లబోసుకున్నారు. బిఎన్ సమక్షంలోనే ఆయనపై ఫిర్యాదులు చేశారు. తమకు బిఎన్ వద్దంటూ మంత్రికి విన్నవించారు. మంత్రికి ఫిర్యాదుచేసిన వారిలో చీమకుర్తి మండలానికి చెందిన తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య, చీమకుర్తి మండల కార్యదర్శి వేల్పుల శ్రీనివాసరావు, మద్దిపాడు వ్యవసాయమార్కెట్‌కమిటీ చైర్మన్ పమిడి వెంకట్రావు ఉన్నారు. ఇదేసమయానికి బిఎన్ అనుకూల వర్గమైన చీమకుర్తి నేతలు మన్నం శ్రీ్ధర్, మన్నం ప్రసాదు, గోగినేని చంద్రశేఖర్, గూడిపాటిప్రసాదు, వెంగన్న బిఎన్ కావాలంటూ మంత్రికి సూచించారు. మండలంలో తమను కలుపుకుని పోవటం లేదని, బిఎన్‌పై గ్రామాల్లో అసంతృప్తిగా ఉన్నారని, గ్రామాల వారీగా తెలుగుదేశంపార్టీని రెండుగ్రూపులుగా విభజిస్తూ బిఎన్ ముందుకువెళ్తున్నారని ఆయన వ్యతిరేకవర్గం మంత్రికి ఫిర్యాదుచేశారు. పార్టీలో సమన్వయం లేదని, అతనికి అనుకూలంగా ఉన్నవారికి పెద్దపీట వేస్తున్నారని ఇలాగే కొనసాగితే 2019 ఎన్నికల్లో నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ గెలవటం కష్టమని మాట్లాడినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. కనీసం బిఎన్‌ను కలవాలని వెళ్తే చీటి రాసి ఇచ్చినా కూడా లోపలికి అనుమతి ఇవ్వని పరిస్థితి వచ్చిందని, సీనియర్లను గౌరవించటం లేదని మంత్రికి ఫిర్యాదుచేసినట్లు తెలుస్తొంది. ఇది ఇలాఉండగా చీమకుర్తి ఎంపిపి భర్త మేదరమెట్ల శ్రీనివాసరావు సమావేశంలో మాట్లాడుతూ తనకు తెలియకుండా ఏడుకోట్లరూపాయలు పనులు జరిగినట్లు ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. తాను పార్టీకోసమే కష్టపడి పనిచేస్తూ అందరిని కలుపుకుని ముందుకు వెళ్తున్నట్లు మంత్రి సునీతకు బిఎన్ తెలిపినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం.
Tags: Three categories .. Aru groups

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *