నెలరోజుల్లో మూడు హత్యలు

కర్నూలు ముచ్చట్లు:
 
కర్నూలు జిల్లాలో వేటకొడవళ్లు సంస్కృతి రోజురోజుకూ హెచ్చుమీరిపోతోంది. ప్రతీకారం పేరుతో ప్రత్యర్థులు హత్యలకు తెగబడుతున్నారు. జిల్లాలో నెల రోజుల వ్యవధిలో మూడు సార్లు వేటకొడవళ్లు, కత్తులతో నరికి చంపారు. జనవరి 13వ తేదీన కర్నూలు నగరంలో ఆఫీస్ నుంచి విధులు ముగించుకుని వస్తున్న విద్యుత్ ఉద్యోగిని కత్తులతో వేటాడి చంపారు. వారం రోజుల కిందట కామవరంలో చెలరేగిన గొడవలో ప్రత్యర్థులను వేటకొడవళ్లతో నరికి.. పెట్రోల్ పోసి తగలబెట్టగా.. తాజాగా కొలిమిగుండ్లలో పొలం తగాదాలో బహిర్భూమికి వెళ్తున్న వ్యక్తిని రాడ్లతో కొట్టి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.భూ తగాదాలో వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో నరికి చంపిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్లలో చోటుచేసుకుంది. కొలిమిగుండ్లకి చెందిన గాండ్ల సుబ్బరామకృష్ణ, రామిశెట్టి గోపాల్‌కి భూ వివాదంలో గొడవ నడుస్తు క్రమంలో ఈ ఘోరం జరిగింది. కొలిమిగుండ్ల టౌన్‌లోని తాడిపత్రి రోడ్డులో ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 395లో సుబ్బరామకృష్ణకు ఎకరా 77 సెంట్లు.. రామశెట్టి గోపాల్ బంధువులకు రెండెకరాల పది సెంట్లు పొలం ఉంది. ఈ రెండు పొలాలు పక్కపక్కనే ఉండటంతో.. సుబ్బరామకృష్ణ తన పొలాన్ని ఆక్రమించారంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో నిన్న జరిగిన వాదోపవాదనల్లో.. కోర్టు ఆర్డర్ మేరకు.. రామశెట్టి గోపాల్ బంధువుల పొలం నుంచి సుబ్బరామకృష్ణకు 6 సెంట్ల పొలం వచ్చింది. తమ పొలంలో నుంచి 6 సెంట్లు సుబ్బరామకృష్ణకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోయిన రామశెట్టి గోపాల్ హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం.. ఈ రోజు తెల్లవారుజామున కొలిమిగుండ్లలోని తేరు బజార్ సందులో సుబ్బరామకృష్ణ బహిర్భూమికి వెళ్తుండగా.. అదే దారిలో కాపు కాసిన గోపాల్ ఇంకొంత మందితో కలిసి రాడ్లతో కొట్టి కత్తులతో పొడిచి హత మార్చారు. హత్య పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
Tags: Three murders in a month

Natyam ad