రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ. 1 లక్షా 20 వేల కోట్లు మహిళలకు అందించాం.

*స్వయం సహాయక సంఘాలకు ఎటువంటి హామీ లేకుండా రూ. 20 లక్షల వరకూ బ్యాంకు రుణాలు..
*వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకం క్రింద 7.97 లక్షల సంఘాలకు రూ. 9,180 కోట్లు అందించాం..
*మహిళా సాధికారిత సాధన దిశగా మహిళా సంక్షేమ పథకాలు అమలు..
-మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి..
 
విజయవాడ ముచ్చట్లు :
రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఇంతవరకూ 1 లక్షా 20 వేల కోట్లు మహిళలకు అందించామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.
విజయవాడ అమ్మ కల్యాణ మండపంలో మంగళవారం సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ” ప్రపంచ మహిళా దినోత్సవం ” లో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం గత 33 నెలల్లో మహిళాసాధికారికతకు లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి మహిళా పక్షపాతిగా ప్రభుత్వం పేరు తెచ్చుకున్నదన్నారు. రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలు జీవితాల్లో ఆర్ధిక, సామజిక, రాజకీయ చైతన్యనినికి అన్ని విధాలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మహిళ అభివృద్ధి ద్వారానే కుటుంబం అభివృద్ధి చెందుతుందని గట్టిగ నమ్మిన ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అనేక పధకాలను అమలు చేస్తున్నదన్నారు. పుట్టిన బిడ్డ మొదలుకుని అలసి సొలసి పనిచేయలేని ముసలి వాళ్ళ వరకూ ప్రతి ఒక్కరి అవసరాలను ప్రభుత్వం గుర్తించి అందుకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద పీట వేశారని దీనిలో భాగంగా అమ్మ ఒడి, వై.ఎస్.ఆర్. ఆసరా, సున్నా వడ్డీ పథకం, వృద్ధాప్య మరియు వితంతు పింఛన్లు, మహిళల రక్షణ కోసం దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారన్నారు. మహిళా సాధికారిత దిశగా అనేక మహిళా సంక్షేమ పధకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. 45 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీలకు చెందిన మహిళలు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా పాదయాత్రలో గమనించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వై.ఎస్.ఆర్. చేయుత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకం క్రింద దాదాపు రాష్ట్రంలో 25 లక్షల మంది మహిళలకు రెండువిడతులుగా వై.ఎస్.ఆర్. చేయుత క్రింద ఇంతవరకు 9180 కోట్ల రూపాయలు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేశామన్నారు.
 
 
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళల ఆర్థికాభివృద్ధి కొరకు ప్రభుత్వం అమలు చేస్తున్న వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకం ద్వారా 7.97 లక్షల మహిళా సంఘాల్లోని 78,76 లక్షల మంది మహిళలకు ఇంతవరకు రూ. 12,758 కోట్లు మహిళా సంఘాల పొదుపు ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందన్నారు. మహిళలను వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా వారి జీవనోపాధిని మెరుగుపరుచుకుని విధంగా గత ఏడాది అమూల్, హిందూస్తాన్, యూని లీవర్, ఐ టి సి, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, అలానా వంటి వ్యాపార దిగ్గజాలతో మరియు బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది రిలయెన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనెజర్, మహేంద్ర అండ్ కెయతి వంటి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు చేశామని స్యయం సహాయక మహిళలకు వ్యాపార మార్గాలను చూపించి ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడం జరిగిందన్నారు.
 
డ్వాక్రా మహిళలకు 20 లక్షల రూపాయల వరకూ ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నామన్నారు. ఇంతవరకూ రాష్ట్రంలో 20 వేల కోట్లకు పైగా మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలను అందించామన్నారు. వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక క్రింద ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే తోలి సంతకంతో ఫించను మొత్తాన్ని 2250 రూపాయలకు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కుల, మత, రాజకీయమైన బేధాలు లేకుండా పారదర్శక విధానంలో అర్హత గల ప్రతి ఒక్కరికి వాలంటీర్లు ద్వారా ఉదయాన్నే తలుపు తట్టి తమ ప్రభుత్వం ఫించన్లు అందిస్తున్నదన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రారంభించగా రాష్ట్రంలోని మహిళా సంక్షేమానికి అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను గురించి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ, సెర్ప్ సి.యి.ఓ. ఏ.ఎమ్.డి. ఇంతియాజ్, నాబార్డ్ జనరల్ మేనేజర్ రమేష్ బాబు, స్త్రీ నిధి ఎమ్.డి. నాంచారయ్య, డైరెక్టర్ విజయ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుండి జిల్లా సమాఖ్య సభ్యులు, మండల సమాఖ్య, గ్రామా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. దారిద్ర్య నిర్ములనకు కృషి చేసిన జిల్లా సమాఖ్యలకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులను మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి అందజేశారు.

 
Tags: Through various welfare schemes in the state, Rs. 1 lakh 20 thousand crore was provided to women.

Natyam ad