నీతి ఆయోగ్ సీఈఓ ని కలిసిన ఎంపీ మద్దిల గురుమూర్తి

తిరుపతి ముచ్చట్లు:
 
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, పైలట్ ప్రాజెక్ట్ కింద కమ్యూనిటీ ఆధారిత రీహాబిలిటేషన్ సెంటర్ మంజూరు చేయాలనీ అభ్యర్ధన భారతదేశంలో తయారీ, రవాణా, శక్తి, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, నీరు మరియు పారిశుధ్యం మొదలైన నిర్దిష్ట రంగాలలో ప్రపంచ స్థాయి ఇంక్యుబేషన్ కేంద్రాలను ప్రోత్సహించడం మరియు స్థాపించడం ఈ పథకం యొక్క లక్ష్యం. బిజినెస్ ఇంక్యుబేషన్ అనేది ఒక వ్యక్తి లేదా సంస్థ స్టార్ట్-అప్ స్థాపన మరియు వృద్ధికి మద్దతు ఇస్తుందని. స్టార్ట్-అప్ లేదా కొత్త కంపెనీలకు మద్దతు ఇచ్చే వారిని బిజినెస్ ఇంక్యుబేటర్స్ అంటారు. ఈ ఇంక్యుబేటర్లు వ్యాపార వృద్ధి సామర్థ్యాన్ని పరిశీలిస్తాయి మరియు ఏదైనా స్టార్టప్‌లో నిధులను సపోర్ట్ చేయడానికి ముందు అవకాశాన్ని అంచనా వేస్తాయి. వ్యాపార విజయావకాశాలను పెంచడమే లక్ష్యంగా ఏ ఇంక్యూబేషన్ సెంటర్స్ పని చేస్తాయి అని తెలియజేసారు. పారిశ్రామికవేత్తలకు శిక్షణలు మరియు మార్గదర్శకత్వం అందించడాం, స్థిరమైన, లాభదాయకమైన వ్యాపార నమూనాను రూపొందించడంలో ఇంక్యుబేషన్ సెంటర్లు సహాయపడుతాయని తెలియజేసారు. తిరుపతి పట్టణం 5 ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు మరియు IIT – తిరుపతి తో విద్యా కేంద్రంగా బాసిల్లుతూ భవిష్యత్ భారతదేశాన్ని నిర్మించడానికి అపార జ్ఞాన వనరులను కలిగి ఉందని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (AIC) యొక్క అవసరం తిరుపతి లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు మరియు ప్రైవేట్ మరియు MSME రంగాలలో ఎంతో అవసరం ఉందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్త లకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేసారు.
 
 
 
అలాగే ప్రతి రోగి యొక్క నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి కమ్యూనిటీ ఆధారిత రీహాబిలిటేషన్ సెంటర్ అవసరం చాలా ఉందని, శారీరక మరియు మానసిక పనితీరుకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి, వెన్నెముక గాయమై వైకల్యానికి గురైన రోగులకు, వయసు పైబడిన రోగులకు వైద్య సహాయం అందించే సమయంలో పునరావాసం కల్పించేందుకు, కుటుంబ పెద్ద అంగవైకల్యానికి గురైనపుడు ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా వారికి పునరావాసం కల్పించి ఆధునిక వైద్యం అందిస్తూ వారికి అండగా నిలిచేందుకు ఈ కమ్యూనిటీ ఆధారిత రీహాబిలిటేషన్ సెంటర్లు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయని చెబుతూ తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకొంటూ, శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), శ్రీ వెంకటేశ్వర రాంనారాయణ్ రుయా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు అనేక మల్టీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లతో ప్రక్కనే ఉన్న నాలుగు జిల్లాల ప్రజలకు ఆధునిక వైద్యానికి తిరుపతి కేంద్రంగా ఉందని, రోగుల ఆరోగ్యం మెరుగుపరచడానికి వారి శ్రేయస్సు దృష్ట్యా కమ్యూనిటీ ఆధారిత రిహాబిలిటేషన్ సెంటర్ పైలట్ ప్రాజెక్ట్ గా ఏర్పాటు చేయాలనీ అభ్యర్దించడం జరిగినది.అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (AIC) మరియు కమ్యూనిటీ ఆధారిత పునరావాస కేంద్రాల ఆవశ్యకత గూర్చి నీతీ ఆయోగ్ సీఈఓకి వివరించిన ఎంపీ గురుమూర్తి గారు అభ్యర్ధన పత్రాలని అందజేశారు, ఈ అభ్యర్థనపై నీతీ ఆయోగ్ సీఈఓ  సానుకూలంగా స్పందించారని త్వరలో వీటి ఏర్పాటు జరుగుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు.

Tags: Tirupati MP Maddila Gurumurthy meets Nithi Aayog CEO

Natyam ad