ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిషోర్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఫైర్
కోల్‌కతా ముచ్చట్లు:
ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ అధిపతి ప్రశాంత్ కిషోర్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీని రాజకీయ పార్టీలాగే నడపాలని, రాజకీయ పార్టీని ఓ కాంట్రాక్టర్ నడపలేడని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా ఉన్న ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ బోర్డుకు నియామకాలపై తనను ఎన్నడూ సంప్రదించలేదని, బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌కు ఐప్యాక్ పలువురిని నియమించిందని గుర్తుచేశారు. ప్రజలకు ఇదంతా ఇప్పుడు తాను వివరించాల్సి వస్తోందని అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయంలో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా కీలకంగా వ్యవహరించారు. ప్రజల ముంగిటే ప్రభుత్వం, బెంగాల్ తన కూతురినే కోరుకుంటోందనే ఆకర్షణీయ నినాదాలతో ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడలు టీఎంసీకి ప్రజల నుంచి మెరుగైన ఆదరణ లభించేలా దోహదపడ్డాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.టీఎంసీని సరికొత్తగా ప్రజల ముందుకు చేర్చడంలో ప్రశాంత్ కిషోర్ సూచనలతో రూపొందిన కార్యక్రమాలు తృణమూల్‌ను తిరిగి బెంగాలీలకు చేరువ చేసిందని చెబుతున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్‌పై తాజాగా టీఎంసీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.
Tags: TMC MP Kalyan Banerjee fires election strategist, Prashant Kishore