ఉద్యోగాల భర్తీపై ప్రకటన పై టీఎన్జీవోల హర్షాతిరేకాలు–సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

జగిత్యాల  ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,147 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు బుధవారం అసెంబ్లీలో ప్రకటించదంపై జిల్లా టీ ఎన్జీవోల,టీ ఉద్యోగుల జే ఏసీ,టీ రెవెన్యూ, టీజీవో ,తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్  సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి.గురువారం టీ ఉద్యోగుల జేఏసి జిల్లా చైర్మన్, జిల్లా టీ ఎన్జీవోల అధ్యక్షుడు భోగ శశిధర్ ఆధ్వర్యంలో టీఎన్జీవోల జిల్లా భవన్ నుంచి ర్యాలీగా  వెళ్లి అంబేద్కర్ విగ్రహం ఎదుట సీ ఎం.కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం,పూలాభిషేకం నిర్వహించారు.అనంతరం జిల్లాఉద్యోగుల జేఏసి చైర్మన్ ,టీ ఎన్జీవోల అధ్యక్షుడు భోగ శశిధర్,టీ రెవెన్యూ జిల్లా అధ్యక్షుడు,ఉద్యోగుల జేఏసి కో చైర్మన్  ఎం.డీ.వకీల్,ఉద్యోగుల జేఏసి జిల్లా గౌరవ అధ్యక్షుడు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ లు మాట్లాడారు.సీ ఎం.కేసీఆర్ ప్రకటన నిరుద్యోగులకు తీపి కబురన్నారు.అసెంబ్లీ సాక్షిగా  నూతన ఉద్యోగాలు భర్తీ ప్రకటన చేసిన సీ ఎం. మరోసారి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని  రుజువు చేశారన్నారు.వివిధ సందర్భాల్లో  టీ ఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి  రాయికంటి ప్రతాప్,ట్రెసా అధికారులు వంగా రవీందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ లు ఉద్యోగ ప్రకటనకు కృషి చేసినందుకు  ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 91,142 ఖాళీలు భర్తీ  చేస్తున్నట్లు , సుమారు 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామనడం నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు  నింపడమే  నన్నారు.నిరుద్యోగులు అందరూ  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వారికి టీ ఎన్జీవోల పూర్తి సహకారం ఉంటుందని,ఉద్యోగాల ఖాళీల భర్తీతో ఉద్యోగులకు  పనిభారం తగ్గుతుందని  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్,జిల్లా ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్,కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,సుంకే రవిశంకర్, రమేష్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీ ఉద్యోగుల జేఏసి జిల్లా చైర్మన్ భోగ శశిధర్, ట్రెసా జిల్లా అధ్యక్షుడు, కో చైర్మన్ ఎం.డీ.వకీల్,టీ ఉద్యోగుల ట్రెసా గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, టీజీవో  కరీంనగర్ జిల్లా కార్యదర్శి విష్ణు వర్ధన్, పెన్షనర్స్ జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్, కోశాధికారి గౌరిశెట్టి  విశ్వనాథం,నాయకులు నాగేందర్ రెడ్డి,ఎలిగేటి రవీందర్,మధుకర్, ,షాహేద్ బాబా,చంద్రిక,జిల్లా,వివిధ టీ ఎన్జీవోల యూనిట్ల  ప్రతినిధులు పాల్గొన్నారు.
 
Tags:TNGVs cheer on announcement on job replacement – anointing to paint CM KCR

Natyam ad