To celebrate Savitribai Poole Jayanthi as Women's Day Day celebration

సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని వినతి

Date: 30/12/2017

హైదరాబాద్ ముచ్చట్లు:

దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రి బాయి పూలే జయంతి జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని బిసి మహిళా ఐఖ్య వేదిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. మహిళల్లో అక్షరాస్యతను నింపి వారిని చైతన్యం చేయడంలో సావిత్రి బాయి పూలే చేసిన కృషి ఏనలేనిదని మహిళా ఐఖ్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు ఆలం పల్లి లత, కార్యదర్శి జి.ఉపేంద్రలు పేర్కొన్నారు. నేడు దేశంలో మహిళలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా, ఎదిగారంటే అది సావిత్రిబాయి పూలే బిక్షేనన్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 3వ తేదీని సావిత్రి బాయి పూలే జన్మ దినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపాలని నిర్ణయించడం హర్షనీయమని పేర్కొన్నారు. ఏపా ప్రభుత్వ నిర్నయాన్ని బిసి మహిళా ఐఖ్య వేదిక స్వాగతిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణా ప్రభుత్వం కుడా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ఆలం పల్లి లత, జి,ఉపెంద్రలు విజ్ఞప్తి చేసారు.

Tag: To celebrate Savitribai Poole Jayanthi as Women’s Day Day celebration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *