విద్యార్థుల్లో క్రీడాసక్తిని పెంపొందించాలి

పెద్దపంజాణి ముచ్చట్లు :
విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల పట్ల కూడా ఆసక్తిని పెంపొందించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి సతీమణి రేణుకారెడ్డి సూచించారు. రాయలపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కె. నారాయణ, స్థానిక సర్పంచ్ ప్రకాశం శెట్టి, ఎంపీటీసి ధనరాణి ఆద్వర్యంలో జరిగిన జోనల్ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాపోటీలను ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ పోటీలలో రామసముద్రం, పుంగనూరు, చౌడేపల్లె, సోమల, పెద్దపంజాణి మండలాలకు చెందిన 9 ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో బాలికల విభాగంలో నిడిగుంట జట్టు రన్నర్స్, రాయలపేట జట్టు విన్నర్స్ గా నిలిచాయి. అదేవిధంగా బాలుర విభాగంలో రాయలపేట జట్టు రన్నర్స్, నిడిగుంట జట్టు విన్నర్స్ గా నిలిచాయి. అనంతరం పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీ శైలజ కుమారి, ఉపాధ్యాయులు, రాయలపేట యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Tag : To develop a sports spirit in students


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *