విద్యార్థుల ప్రామాణికతను పెంపొందించాలి – ఎంఈవో హేమలత

పెద్దపంజాణి ముచ్చట్లు :
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క విద్యాప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాద్యాయులు కృషి చేయాలని ఎంఈవో హేమలత సూచించారు. స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో జరిగిన సీఆర్సీ సమావేశంలో  పెద్దపంజాణి, నేలపల్లె,రాయలపేట,ముత్తుకూరు, నిడిగుంట,రాజుపల్లె పాఠశాలల విద్యార్థుల ప్రామాణికత,ఇషా విద్య అమలు పై ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. అదేవిదంగా ఈ నెల 25,27,28 తేదీల్లో జరిగే సబ్జెక్టు సీఆర్సీ సమావేశాలకు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు హాజరు కావాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్సీ ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి, ఇషా కోఆర్డినేటర్లు,ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Tag : To increase student authenticity


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *